బాక్సాఫీస్‌ పై కమల్ హాసన్ దండయాత్ర, 4 సినిమాలతో హల్చల్ చేయబోతున్న లోక నాయకుడు

Published : Nov 05, 2025, 05:45 PM IST

కమల్ హాసన్ 70వ వసంతాలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోల మాదిరిగా.. సినిమాల్లో చాలా చురుకుగా ఉన్నారు. ఈమధ్య వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లోకి వచ్చిన కమల్.. 4 సినిమాలతో దండయాత్రం చేయబోతున్నాడు. 

PREV
15
కమల్ హాసన్ రాబోయే సినిమాలు

కమల్ హాసన్ చివరిగా 'థగ్ లైఫ్' సినిమాలో కనిపించారు. ఆ సినిమా యావరేజ్  హిట్ అయింది. తన కెరీర్‌లో ఎన్నో సూపర్  హిట్ సినిమాలు చేసిన లోకనాయకుడు.. ఈ వయస్సులో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా.. వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. 4 సినిమాలతో బాక్సా ఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్నాడు. 

25
కల్కి పార్ట్ 2

'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌లతో పాటు కమల్ హాసన్ కూడా సందడి చేయనున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. కల్కీ పార్ట్ 2 మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. మరి ఈసారి కమల్ పాత్ర ఎలా ఉంటుందోే చూడాలి. 

35
ఇండియన్ 3

'ఇండియన్' సినిమా మేకర్స్ మూడో భాగాన్ని తీయడానికి సిద్ధమవుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు కాజల్, సిద్ధార్థ్, రకుల్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఇండియన్ 2 డిజాస్టర్ అయిన క్రమంలో.. పార్ట్ 3 పై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు టీమ్. 

45
విక్రమ్ 2

' విక్రమ్' సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించాక, ఇప్పుడు మేకర్స్ రెండో భాగాన్ని తీయబోతున్నారు. చాలా కాలం ఫెయిల్యూర్స్ తో బాధపడ్డ కమల్ హాసన్.. విక్రమ్ సినిమాతో కమ్ బ్యాక్ అయ్యాడు. ఈమూవీ కమల్ కెరీర్ లోనే అత్యధికంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ను చేయబోతున్నారు. 

55
వేట్టైయాడు విలయాడు 2

కమల్ హాసన్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'వేట్టైయాడు విలయాడు' సినిమాకు రెండో భాగం రాబోతోందని వెల్లడించారు. ఈమూవీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈసినిమా తమిళం వరకే రూపొందే అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories