జబర్దస్త్ కి ఒకప్పుడు ఉన్నంత ఆదరణ లేదు. స్టార్స్ నిష్క్రమణతో ప్రాభవం కోల్పోయింది. ఒకప్పుడు జబర్దస్త్ టాప్ రేటెడ్ షో. అనసూయ, నాగబాబు, రోజా, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది షోకి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టారు. ఇప్పుడు వారెవరూ లేరు. చాలా మంది కొత్త వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు.