ఎన్టీఆర్‌ ఏ కొడుక్కి భయపడతాడో తెలుసా? బాలయ్యని ఏకంగా ఉరికించి కొట్టాడట.. ఆయనంటే అందరికి హడల్‌

First Published | Jul 8, 2024, 7:38 PM IST

నందమూరి ఫ్యామిలీలో ఒకే ఒక్కరికి అందరు భయపడతారట. ఏకంగా ఎన్టీఆర్‌ కూడా ఆయనకు భయపడతాడట. బాలకృష్ణని ఓ సారి ఉరికించి కొట్టాడట. మరి ఆ నందమూరి వారసుడు ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌ తొలి తరం నటుడిగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో సృష్టించిన సంచలనాలు ఎలాంటివో అందరికి తెలిసిందే. అద్బుతమైన నటనతో నటనా సార్వభౌముడిగా ఆయన్ని తెలుగు ప్రజలు కీర్తిస్తుంటారు. తన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన సినిమాల్లో నటించారు. అప్పట్లో ఏక కాలంలో మూడు నాలుగు సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఫ్యామిలీకి టైమ్‌ ఇచ్చేవారు కాదు. దీంతో ఆయన పిల్లలు హైదరాబాద్‌లో, సొంతూరులో పెరగాల్సి వచ్చిందట. 

బాలకృష్ణ, తన అక్కలు, తమ్ముళ్ళు హైదరాబాద్‌లో పెరిగితే, అన్నయ్యలు సొంతూరులో తాతయ్య వద్ద పెరిగారట. అలా హరికృష్ణ కూడా ఊర్లోనే పెరిగాడట. అంతేకాదు వ్యవసాయ పనులు కూడా చూసుకునేవాడట. పెద్దన్నయ్యలతో కలిసి ఆయన తాతకి సపోర్ట్ గా ఉండేవారని తెలిపారు బాలకృష్ణ. ఈ సందర్భంగా హరికృష్ణ గురించి చెబుతూ, నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకు బ్యాక్‌ బోన్‌లా ఉన్నారని, అన్నీ తానై చూసుకునేవాడని తెలిపారు. 
 

Latest Videos


అన్నయ్య ఆరా ఒక రేంజ్‌లో ఉంటుందని, చూడ్డానికి గాంభీర్యంగా ఉంటాడని, ఆయన ఆకారం, నడవడిక చాలా హుందాగా ఉంటుందని, అలా చూస్తేనే భయం వేస్తుంటుందన్నారు బాలయ్య. ఆయన నడిచి వస్తుంటే ఆరా కదులుతుందన్నారు. ఆయన్ని చూస్తే ఒక పెద్ద అనే భావన, గౌరవం, భయం, భక్తి ఇలాంటివన్నీ కలుగుతాయని చెప్పారు. నాన్నగారికి ఎలా ఉండేదో, అన్నయ్యకి కూడా అలానే ఉండేదని, ఆయన్ని చూసి మేం కూడా భయపడే వాళ్లమని తెలిపారు బాలకృష్ణ. 
 

ఓ సారి జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు ఓ సారి ఊరికి వెళ్లారట. ఇంటికెళ్లాక తాతగారిని అన్నయ్య ఎక్కడ అడిగితే పొలం వద్ద ఉన్నాడని చెప్పారట. దీంతో తాను ఇతర అన్నయ్యలతో కలిసి పొలంకి వెళ్లారట. ఆ సమయంలోనే పొలంలో నుంచి బయటకు వస్తున్నాడు. పంచె కట్టి, టవల్‌ కట్టుకుని కట్టే పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడట. ఎలా ఉన్నారనే మాటలు మాట్లాడుకున్నారట. అనంతరం ఎలా ఉంది మన పొలం అన్నాడట బాలకృష్ణ. 
 

మనం పొలం అంటావా అని కర్రపట్టుకుని బాలకృష్ణని, ఆయన తమ్ముళ్లని వెంటపడి కొట్టాడట. ఇంటి వరకు ఉరికించి కొట్టుకుంటూ వచ్చాడట. మన పొలం అంటాడా? కష్టపడి పని చేశాడా? కోత కోశాడా? వీళ్లకేం అధికారం ఉంది, కష్టపడింది నువ్వు, నేను అన్నాడట హరికృష్ణ. ఆ సమయంలో తాత కూడా ఆయన్నే వెనకేసుకుని వచ్చాడట. మొదట్నుంచి ఆ కష్టం తెలిసిన మనిషి, మొరటు మనిషి అని చెప్పాడు బాలకృష్ణ. 

ఆయన అనుకున్నది సాధించే వరకు ముందుకు సాగుతాడని, లాభనష్టాలను పట్టించుకోరని, హరికృష్ణ అన్నయ్య అంటే నాన్నగారికి కూడా భయం అని, కొన్ని సందర్బాల్లో ఆయన కూడా భయపడేవాడని తెలిపారు బాలకృష్ణ. `కథానాయకుడు` సినిమా ఇంటర్వ్యూ టైమ్‌లో ఈ విషయాలను వెల్లడించారు బాలయ్య.  మా ఫ్యామిలీలో రెబల్‌ అంటే అన్నగారే అని, ఆయనంటే అందరికి హడల్‌ అని తెలిపారు. 
 

హరికృష్ణ.. ఎక్కువగా ఎన్టీఆర్‌కి సంబంధించిన పర్సనల్‌ వ్యవహారాలు చూసుకునేవారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆయనే అన్నీ తానై వ్వవహారించారు. వెనకుండి నడిపించారు. అంతేకాదు నటుడిగానూ మెప్పించారు. బాలనటుడిగా మెరిసిన ఆయన `శ్రీరాములయ్య`, `శుభలేఖలు` చిత్రాలతో నటుడిగా అలరించారు.

NTR

`సీతారామరాజు` చిత్రంతో పూర్తి స్థాయి నటుడిగా టర్న్ తీసుకున్నారు. `లాహరి లాహిరి లాహిరిలో`, `శివరామరాజు` చిత్రాల్లో మెయిన్‌ రోల్స్ చేశారు. `సీతయ్య` చిత్రంలో హీరోగా నటించారు. `టైగర్‌ హరిశ్చంద్ర  ప్రసాద్‌`, `సామీ`, `శ్రావణమాసం` చిత్రంలోనూ హీరోగా అదరగొట్టారు. హరికృష్ణ 2018లో నల్గొండ జిల్లా నార్కటపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. 

click me!