'క' సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది?

First Published | Nov 9, 2024, 6:52 AM IST

కిరణ్ అబ్బవరం నటించిన 'క' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర బృందం స్పష్టతనిస్తూ, త్వరలో ఓటీటీలోకి రాదని, థియేటర్లలోనే చూడాలని ప్రకటించింది.


పెద్ద సినిమాలు, స్టార్స్ తో ఉన్నవి థియేటర్ కు వెళ్లి ప్రేక్షకులు ఎలాగో చూస్తూంటారు. అయితే చిన్న సినిమాల దగ్గరకి వచ్చేసరికే సమస్య వచ్చేస్తుంది. ఆ...ఎలాగో ఓటిటిలో వచ్చేస్తుంది కదా అని లైట్ తీసుకుంటారు. దానికి తోడు నెల రోజుల్లోనే చిన్న సినిమాలు ఓటిటిలలోకి దూకేస్తున్నాయి.

ఈ క్రమంలో చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ఉండటం  లేదు. మీడియా కూడా ఫలానా రోజున ఓటిటిలోకి వచ్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్దితి కిరణ్ అబ్బవరం 'క' కు వచ్చింది. దాంతో నిర్మాతలు ఓటిటి విషయమై ప్రకటన చేయాల్సి వచ్చింది.
 

Kiran Abbavaram , KA movie


వివరాల్లోకి వెళ్తే గత వారం థియేటర్లలో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.  మంచి  కలెక్షన్స్ తెచ్చుకుంటున్నాయి. అదే సమంయలో  కిరణ్ అబ్బవరం 'క'  మూవీనే దీపావళి విన్నర్‌గా తేలింది.

థియేటర్లలో సక్సెస్‌ఫుల్ ఆడుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు వచ్చేస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందనే సోషల్ మీడియాలో పోస్ట్ లు పడుతున్నాయి. ఈటీవి విన్ ఓటీటీలోకి వస్తుందని చెప్తున్నారు. ఈ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడుతోంది. 
 



ఈ నేపధ్యంలో ఈ రూమర్లపై ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇచ్చేసింది. 'క' మూవీని థియేటర్లలోనే చూడండి. ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు అంటూ ట్వీట్ చేసింది.  ”క’ మూవీ ఇప్పట్లో ఓటీటీలోకి రాదు.

థియేటర్లలోనే చూడండి. త్వరలో ఓటీటీలో ఈ సినిమా విడుదల అవుతుందని వస్తున్న అసత్య వార్తలను నమ్మకండి’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు మేకర్స్. తద్వారా క సినిమా ఓటీటీ రిలీజ్ పై వస్తోన్న వార్తలకు చెక్ పెట్టారు.


 ఇదిలా ఉంటే  ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ఇతర భాషల్లో విడుదలకి వెళ్తోంది.. అలా హిందీ, మళయాళం, తమిళ్ భాషల్లో విడుదలకి సిద్ధం అయ్యింది.  

వీటిలో మళయాళ వెర్షన్ ఈ నవంబర్ 15న విడుదల కాబోతుండగా మిగతా రెండు భాషల్లో నవంబర్ 22న “క” థియేటర్స్ లో సందడి చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి సందీప్, సుజీత్ లు దర్శకత్వం వహించగా క ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.


చింతా వరలక్ష్మి సమర్పణలో.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గోపాలకృష్ణారెడ్డి క సినిమాను నిర్మించారు. 1977 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ అనే పోస్ట్ మ్యాన్ పాత్రలో అద్బుతంగా నటించాడు.

అలాగే అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, రాడిన్ కింగ్ స్లే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజయ్యింది. కాగా క సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ తో పాటు ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Latest Videos

click me!