కాలేయ వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి నరకం అనుభవించారు. నిండుగా ఉండే మనిషి.. ఈ జబ్బు వల్ల గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సన్నగా పీలగా అయిపోయారు. ఆర్ధికంగా కూడా చాలా ఇబ్బందులు అనుభవించిన రామిరెడ్డి. ట్రీట్మెంట్ చేయించుకుంటూనే 2011 ఏప్రిల్ 14న కన్నుమూశారు.
రామిరెడ్డి చిత్తూరు జిన్నా వాయల్పాడు సమీపంలోని ఓబుళంవారిపల్లెలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పట్టా తీసుకున్న ఆయన మొదట్లో ఉర్దూ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నటుడు, జర్నలిస్ట్ మాత్రమే కాదు బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా.