వరుణ దేవుడు కరుణించిన ఇండస్ట్రీ హిట్ చిత్రానికి 25 ఏళ్ళు, ఇద్దరు స్టార్లు రిజెక్ట్ చేయడంతో తరుణ్ దశ తిరిగింది

Published : Oct 13, 2025, 12:40 PM IST

Nuvve Kavali @25: యంగ్ హీరో తరుణ్ నటించిన నువ్వే కావాలి చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నువ్వే కావాలి విశేషాలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో తరుణ్, రిచా జంటగా నటించారు.  

PREV
15
25 ఏళ్ళు పూర్తి చేసుకున్న నువ్వే కావాలి

చైల్డ్ యాక్టర్ గా అనేక చిత్రాల్లో నటించిన తరుణ్ 2000 సంవత్సరంలో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే తరుణ్ బాక్సాఫీస్ వద్ద విస్ఫోటనం సృష్టించాడు. ఆ మూవీ ఏంటో ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది.. అదే నువ్వే కావాలి చిత్రం. తరుణ్, రిచా పల్లోడ్ జంటగా నటించిన ఈ మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి దర్శకుడు విజయభాస్కర్ కాగా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. రామోజీ రావు, స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ విడుదలై నేటితో 25 ఏళ్ళు పూర్తయింది. దీనితో ఈ చిత్ర విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

25
ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేయడంతో తరుణ్ కి ఛాన్స్

మలయాళంలో సూపర్ హిట్ అయిన నీరం అనే చిత్రానికి నువ్వే కావాలి రీమేక్ గా తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ కథలో మార్పులు చేశారు. ముందుగా ఈ చిత్రంలో హీరోగా పవన్ కళ్యాణ్, సుమంత్ లని అనుకున్నారట. వారిద్దరూ రిజెక్ట్ చేయడంతో తరుణ్ కి అవకాశం వచ్చింది. తాను ఒకసారి రోజా రమణి గారి ఇంటికి వెళ్ళినప్పుడు తరుణ్ బుక్స్ పట్టుకుని కాలేజ్ కి వెళుతున్నాడు. తరుణ్ ని చూసిన క్షణమే నా మూవీలో ఇతడే హీరో అని ఫిక్స్ అయినట్లు విజయ భాస్కర్ తెలిపారు.

35
సమయానికి ఫైర్ ఇంజన్లు లేవు

ఈ మూవీలో ఇంటర్వెల్ సన్నివేశం గురించి విజయభాస్కర్ గుర్తు చేసుకున్నారు. అది వర్షం పడే సన్నివేశం. హైదరాబాద్ పోలీస్ అకాడమీ గ్రౌండ్ లో ఆ సన్నివేశాన్ని షూట్ చేయాలి. వర్షం పడేలా చూపించడం కోసం నాలుగు ఫైర్ ఇంజన్లని ఏర్పాటు చేశాం. నటీనటులు, నేను, సినిమాటోగ్రాఫర్ అందరం షూటింగ్ కి బయలుదేరాం. ఇంతలో ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేవని ప్రొడక్షన్ టీమ్ చెప్పింది. చాలా నిరాశగా అనిపించింది.

45
కరుణించిన వరుణ దేవుడు

మేము పోలీస్ గ్రౌండ్స్ కి చేరుకునే సమయానికి వర్షం నిజంగా పడడం ప్రారంభం అయింది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం పరుగులు పెట్టి నిజమైన వర్షంలో ఆ సీన్ ని సహజసిద్ధంగా చిత్రీకరించాం. మంచి పని తలపెడితే ప్రకృతి కూడా సహకరిస్తుంది అని అంటారు. ఆరోజు మాపై వరుణ దేవుడు కరుణ చూపించాడు. నాలుగు గంటల పాటు వర్షంలో ఆ సీన్ పూర్తి చేసినట్లు విజయ భాస్కర్ తెలిపారు.

55
నువ్వే కావాలి రికార్డులు

నువ్వే కావాలి చిత్రం విడుదలై సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 30 సెంటర్లలో 100 రోజులు.. 30 సెంటర్లలో 200 రోజులు.. 6 సెంటర్లలో 365 రోజులు ప్రదర్శించబడింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం 19 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఈ మూవీతో తరుణ్ తెలుగులో తిరుగులేని యంగ్ హీరోగా మారిపోయాడు.

Read more Photos on
click me!

Recommended Stories