Actress Vidya Balan: ఒకప్పుడు ఈ నటిని ఐరన్ లెగ్ అని అన్నారు.. ఏకంగా 12 చిత్రాలకు దూరమైంది. వచ్చినట్టే వచ్చిందనుకున్న ఆఫర్లు చేజారిపోయాయి. కట్ చేస్తే.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్‌గా మారింది. మరి ఆమె ఎవరో తెలుసా.?
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆమె సహజ నటన ఆమెను బాలీవుడ్ అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా నిలిపింది. ఇక విద్యాబాలన్ సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే కాదు.. బుల్లితెరలోనూ నటించిన విషయం మీకు తెలుసా.?
25
కెరీర్ ప్రారంభంలో 'హమ్ పాంచ్'
విద్యాబాలన్ తన చదువును కొనసాగిస్తున్నప్పుడు అనగా.. 1995లో ఆమెకు 'హమ్ పాంచ్' అనే షో కోసం ఆఫర్ వచ్చింది. ఆమె తల్లి తన నటనకు అంగీకరించకపోయినా.. అనుమతి తీసుకుని మరీ తనకు ఇష్టమైన షోలో నటించింది విద్యాబాలన్. ఏడాదిన్నర పాటు ఆ షోలో పనిచేసిన తర్వాత, విద్యాబాలన్ పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. ఆపై మలయాళంలో ఆఫర్ దక్కించుకుంది. అంతేకాదు ఏకకాలంలో 12 సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. అయితే, కొన్ని కారణాల వల్ల అవన్నింటిని కోల్పోయింది.
35
సినిమా అరంగేట్రం మోహన్‌లాల్‌తో..
బుల్లితెర నుంచి విరామం తీసుకున్న తర్వాత.. విద్యాబాలన్ ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం కేరళకు వెళ్ళింది. అక్కడ ఓ నిర్మాత ఆమెను చూడటం జరిగింది. అలా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ 'చక్రభ' సినిమా ఆఫర్ దక్కింది. అయితే ఆ సినిమా ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో.. ఆమెకు అంతకముందు వచ్చిన 12 చిత్రాలు కూడా దూరమయ్యాయి.
ఒకేసారి డజను సినిమాలు కోల్పోవడంతో విద్యాబాలన్ కాసింత డిప్రెస్ అయినా.. ఆ తర్వాత మనోధైర్యాన్ని కోల్పోలేదు. క్లిష్ట సమయంలో ఆమె తన ఇంటికి సమీపంలోని ఒక ఆలయాన్ని సందర్శించి దేవుడ్ని మొక్కుకుంది. ఆపై బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక అనంతరం తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
55
బాలీవుడ్‌లో గొప్ప చిత్రాలకు కేరాఫ్..
విద్యాబాలన్ 2005లో సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్‌లతో కలిసి 'పరిణీత' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన 20 సంవత్సరాల బాలీవుడ్ కెరీర్‌లో 'మిషన్ మంగళ్', 'తుమ్హారీ సులు', 'కహానీ', 'ది డర్టీ పిక్చర్', 'నో వన్ కిల్డ్ జెస్సికా', 'ఇష్కియా', 'పా', 'భూల్ భూలైయా', 'హే బేబీ', 'లగే రహో మున్నాభాయ్' వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది.