వందకోట్ల "మార్కో" సినిమా: టీవీల్లో,ఓటిటిలలో బ్యాన్,ఇదేం ట్విస్ట్

Published : Mar 05, 2025, 04:47 PM IST

Marco Ban: ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమా టీవీలో ప్రసారం చేయడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమాలో హింస, రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

PREV
14
 వందకోట్ల "మార్కో"  సినిమా: టీవీల్లో,ఓటిటిలలో  బ్యాన్,ఇదేం ట్విస్ట్
Marco starring Unni Mukundan No TV screening in telugu


Marco Ban: సినిమా రిలీజ్ కు ముందే సెన్సార్ అవుతుంది. ఏదన్నా సమస్యలు ఉంటే సెన్సార్ దగ్గరే ఆపేస్తారు. అలాగే టీవిల్లో ప్రసారం చేసేముందు ఖచ్చితంగా కొన్ని సీన్స్ రీ సెన్సార్ చేస్తారు. అయితే ఎప్పుడూ ఓ సూపర్ హిట్ సినిమాని టీవీల్లో బ్యాన్ చేయటం జరగలేదు.

కానీ అరుదైన సంగతి  మళయాళ చిత్రం మార్కో విషయంలో చోటు చేసుకుంది. దాంతో నిర్మాతలు, ఈ సినిమా అభిమానులు ఉలిక్కిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ రేంజిలో డిస్కషన్స్ మొదలెట్టారు. అసలేం జరిగింది. 
 

24
Marco starring Unni Mukundan No TV screening in telugu


మళయాళ  హీరో ఉన్ని  ముకుందన్ నటించిన "మార్కో" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందనే సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో మలయాళ ప్రముఖ డైరెక్టర్ హనీఫ్ అదేని తెరకెక్కించాడు.

ఈ సినిమాలో జగదీష్, కబీర్ దుహాన్ సింగ్, సిద్ధిక్, అన్సన్ పాల్ మరియు యుక్తి తరేజా తదితరులు ప్రధాన తారాగణంగా నటించగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్ సంగీతం అందించాడు.  ఉన్ని ముకుందన్ పవర్ఫుల్ యాక్షన్, డైరెక్టర్ టేకింగ్, రవి బస్రూర్ మ్యూజిక్ ఇవన్నీ చక్కగా వర్కౌట్ అయ్యాయి.

దీంతో మార్కో రిలీజ్ అయిన 25 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. అంతేకాదు ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు టీవీల్లో ప్రసారం చేయటానికి వీల్లేదని తేల్చి చెప్పింది సెన్సార్ బోర్డ్. 
 

34
Marco starring Unni Mukundan No TV screening in telugu


తాజాగా మార్కో చిత్ర యూనిట్ కి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాలలో రక్తపాతం ఎక్కువగా ఉందని అందుకే టెలివిజన్ లో ప్రసారం చెయ్యద్దని ఆదేశాలు జారే చేసింది.

ఈ క్రమంలో శాటిలైట్ హక్కులని టీవీ  ఛానెల్స్ కి అమ్మెందుకు రిక్వెస్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‍సీ) కి రిక్వెస్ట్ చెయ్యగా తిరస్కరించింది. దీంతో మార్కో సినిమా ప్రసారం టెలివిజన్ ఛానెల్స్ లో లేనట్లేనని తెలుస్తోంది. 

44
Marco starring Unni Mukundan No TV screening in telugu


అలాగే ఈ సినిమాను ఓటీటీ (Marco OTT Ban)లో నుంచి బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోరింది.

ఈ చిత్రాన్ని మ‌రి దారుణంగా తెర‌కెక్కించ‌డంతో పాటు చిన్న పిల్ల‌ల‌ను క్రూరంగా చంప‌డం, గ‌ర్భిణి యువ‌తిని.. కళ్లు లేని యువకుడిని చంపే స‌న్నివేశాలు దారుణంగా ఉన్న‌యంటూ సెన్సార్ బోర్డ్ తెలిపింది.అయితే ప్రస్తుతం మార్కో సినిమా ప్రముఖ ఓటీటీలైన సోనీలివ్, ఆహా లో అందుబాటులో ఉంది. ఇందులో మార్కో మలయాళ వెర్షన్ సోనీలివ్ లో అందుబాటులో ఉండగా, తెలుగు వెర్షన్ ఆహాలో చూడవచ్చు.
 

Read more Photos on
click me!

Recommended Stories