సినిమా ప్రముఖులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమే. టాలీవుడ్‌లో మహేష్ బాబు-నమ్రత, నాగార్జున-అమల, పవన్-రేణు దేశాయ్, అలాగే కోలీవుడ్‌లో అజిత్ - షాలిని, సూర్య - జ్యోతిక, రాధిక - శరత్‌కుమార్,
విఘ్నేష్ శివన్ - నయనతార, ఆది - నిక్కీ గల్రానీ, గౌతమ్ కార్తీక్ - మంజిమా మోహన్ వంటి అనేక మంది ప్రముఖులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ జాబితాలో తాజాగా మరో జంట చేరింది.
హీరోయిన్ తన్య రవిచంద్రన్ తన ప్రియుడి గురించి మొదటిసారిగా ప్రకటించారు. గౌతమ్ జార్జ్ ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా నిశ్చితార్థ ఫోటోను పోస్ట్ చేసి తన పెళ్లి గురించి వెల్లడించారు. తన్య తెలుగులో `గాడ్ ఫాదర్`లో నటించింది.