
టీవీ నటి తనూజ పుట్టస్వామి.. బిగ్ బాస్ తెలుగు 9లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఇందులో రన్నరప్‌గా నిలిచి ఆశ్చర్యపరిచింది. అనంతరం తనూజ టీవీ షోస్‌లో మెరుస్తుంది. ఇప్పుడు పలు ఇంటర్వ్యూలిస్తూ అలరిస్తోంది. బీబీ జోడీలో పాల్గొంది, కూకూ జాతిరత్నాలు వంటల కార్యక్రమంలో సందడి చేసింది. అయితే ఎప్పుడూ పబ్లిక్‌లో ఉండని, సోషల్ మీడియాలో రియాక్ట్ కాని తనూజ.. ఇప్పుడు సడెన్‌గా పబ్లిక్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ కి రియాక్ట్ అయ్యింది. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసింది.
తనూజపై ఎంఎం(ముద్దమందారం) టీమ్ వాళ్లు కుట్రలు చేస్తున్నారని, పవన్ సాయిని దూరం పెట్టారని, కళ్యాణ్ వచ్చాక ఆయన్ని పట్టించుకోలేదని, ఇలా అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు. తనూజ మారిపోయిందనేలా ఆమె క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసేలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తనూజ స్పందించింది. తనని టార్గెట్ చేస్తూ, ముద్దమందారం టీం కుట్రలు చేస్తున్నారనేదానికి, పవన్ సాయితో రిలేషన్, కళ్యాణ్ పడాలతో బాండింగ్‌కి సంబంధించిన విమర్శలు, ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై స్పందించింది తనూజ. ట్రోలర్స్ ని ఆడుకుంది.
పనీపాట లేని వాళ్లు మాత్రమే ఇలా రియాక్ట్ అవుతారని తెలిపారు. బిగ్ బాస్ షో అయిపోయి ఏడు నెలలు అయ్యింది. ఇంకా ఆ షో గురించి అందులోని విషయాల గురించే మాట్లాడుకుంటున్నారు, అవే కామెంట్లు చేస్తున్నారని, దయజేసి వాటిని వదిలేయాలని తెలిపింది తనూజ. షోలో కాంపిటీషన్ ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది. షో అయిపోయాక కూడా అలానే ఉండలేం. ఇప్పుడు మేమంతా బాగానే ఉన్నాం, కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం, బాధుంటే పంచుకుంటాం, సంతోషాలను పంచుకుంటాం, మేం బాగానే ఉన్నామని తెలిపింది తనూజ. మాకు లేని బాధ మీకు ఎందుకో అర్థం కావడం లేదని ప్రశ్నించింది.
ఓ పెద్దమనిషి..ఎంఎం టీమ్(ముద్దమందాం) టీమ్ వాళ్లు కుట్రలు చేస్తున్నారని కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయన్ని ఆడుకుంది తనూజ. ఆ కుట్రలు ఏంటో చెప్పాలని ప్రశ్నించింది. ఆ కుట్రలంటూ కామెంట్లని ఆపాలని, మీకు పనీపాట లేదని, ఖాళీగా ఉంటే, ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేసుకోవాలని, మీ మైండ్ సరిగా లేకపోతే చూపించుకోవాలని తెలిపింది. అదే సమయంలో సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగటివ్ కామెంట్లని, పోస్ట్ లను గానీ తనకు పంపవద్దని అభిమానులను కోరింది. వాటికి తాను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని, కానీ ఇలా పంపడం వల్ల, తాను చూస్తే డిస్టర్బ్ అవుతానని, అందుకే వద్దు అని చెప్పింది.
ప్రతిసారి ఎంఎం టీమ్, పీఎస్ అంటున్నారు. కళ్యాణ్ ఓ షోలో మాట్లాడుతూ, తనూజ తనకు హెల్ప్ చేసిందని, సమస్య నుంచి బయటపడేసిందని అంటున్నారు. కానీ ఆ సమస్య సెట్ చేయడానికి నేను కాల్ చేసింది పీఎస్(పవన్ సాయి)కే అని తెలిపింది తనూజ. ఆ రోజు కళ్యాణ్ ఆ సమస్య నుంచి బయటపడేలా చేయడంలో పీఎస్ ముందున్నాడని, ఆయన ఇంటికి వెళ్లిపోయిన తర్వాతనే పీఎస్ వెళ్లాడని చెప్పింది. బిగ్ బాస్ షోలో పీఎస్ గురించి మాట్లాడలేదంటున్నారు. షోలో మేం మాట్లాడుకున్న అన్ని విషయాలు చూపిస్తారా? మీకు తెలుసా? కళ్యాణ్ నేను పీఎస్ గురించి మాట్లాడుకోలేదని, అందులో చాలా సార్లు మాట్లాడుకున్నామని చెప్పింది తనూజ.
కళ్యాణ్ గురించి చెబుతూ.. కళ్యాణ్, నేను బాగానే ఉన్నామని, ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ అని, మా ఇంట్లో అతను తెలుసు, మా మధ్య మంచి రిలేషన్ ఉందని చెప్పింది. ప్రతిసారి ఎంఎం, పీఎస్ అంటున్నారు. కానీ బిగ్ బాస్ వెళ్లేందుకు వాళ్లే సపోర్ట్ చేశారు. ఎప్పుడూ ఇదేనా కొత్తగా చేయాలని చెప్పి ప్రోత్సహించారు. షో తర్వాత వచ్చే నెగటివిటీ విషయంలో కూడా ఎంఎం వాళ్లు సపోర్ట్ గా ఉన్నారు. నెగటివ్ విషయాలను వదిలేయాలని చెప్పినట్టు తెలిపింది తనూజ. పవన్ సాయి, హరితమ్మ ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. మా మధ్య మంచి రిలేషన్ ఉందని, ఈ వివాదంలోకి వాళ్లని లాగొద్దని చెప్పింది. అనవసరంగా దీనిపై రచ్చ చేయోద్దని, నెగటివ్ కామెంట్లు చేయోద్దని తెలిపింది. ఈ సందర్భంగా తన అభిమానులకు రిక్వెస్ట్ చేస్తూ, నెగటివిటీని విస్తరించవద్దు అని, అందరిని రెస్పెక్ట్ చేయాలని, కుదిరితే ఇతరులకు సహాయం చేయాలని చెప్పింది. హ్యాపీగా, ప్రశాంతంగా ఉండాలని వెల్లడించింది. అదే సమయంలో ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చింది. తమ గురించి కామెంట్ చేయడానికి మీకు ఎలాంటి రైట్ ఉందని ప్రశ్నించింది. తనూజ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.