తమిళ నటి ఆనంది అజయ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమా నుంచి తన సన్నివేశాలను తొలగించారని ఆరోపిస్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియో అందరినీ కదిలించింది. ఇంతకీ ఎవరీ ఆనంది అజయ్?
తమిళ నటి ఆనంది అజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. తళపతి విజయ్ హీరోగా వస్తున్న 'జన నాయగన్' సినిమా నుంచి తన సీన్లను తొలగించారంటూ ఆమె ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి అభిమానులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరీ ఆనంది అజయ్? పూర్తి వివరాలు చూద్దాం.
25
టెలివిజన్ రంగంలో చాలా పాపులర్ నటి
ఆనంది అజయ్ తమిళ టెలివిజన్ రంగంలో చాలా పాపులర్ నటి. ఎన్నో హిట్ సీరియళ్లలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై తన నటనతో తమిళ ప్రేక్షకులకు ఆమె సుపరిచితమైన ముఖంగా మారారు. నటనతో పాటు, ఆనంది ఒక శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్, యోగా ప్రియురాలు కూడా. తన డ్యాన్స్, ఫిట్‌నెస్ వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటారు.
35
ఆనంది టీవీ సీరియల్స్ ఇవే
ఆనంది పలు ప్రముఖ తమిళ టీవీ సీరియళ్లలో కనిపించారు. వాటిలో కొన్ని:
* కార్తిగై పెంగళ్
* యమునా
* కణా కానుమ్ కాలంగళ్
* కల్లికాట్టు పల్లికూడమ్
ఈ సీరియళ్లలో ఆమె నటన తమిళ టెలివిజన్ రంగంలో ఆమెకు బలమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది.
ఇటీవల ఆనంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. 'జన నాయగన్' ఫైనల్ కట్ నుంచి తన సీన్లను తొలగించారని కన్నీళ్లతో చెప్పారు. దాదాపు ఏడాదిగా ఈ ప్రాజెక్ట్‌తో ఉన్నానని, విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నటనకు దూరంగా వెళ్లే ముందు విజయ్ చేస్తున్న చివరి సినిమా ఇదేనని ప్రచారం జరుగుతుండటంతో, ఈ అవకాశం కోల్పోవడం తనను మరింత బాధించిందని ఆమె పేర్కొన్నారు.
55
సీన్లు తొలగించడంపై నిరాశ
ఆనంది ఎమోషనల్ వీడియో వెంటనే వైరల్ అయింది. కామెంట్స్ సెక్షన్‌లో అభిమానులు ఆమెకు సపోర్ట్ గా సందేశాలు పంపారు. చాలామంది ఆనంది టాలెంట్‌ను మెచ్చుకుంటూ, ధైర్యం కోల్పోవద్దని కోరారు. ఆమె సీన్లు తొలగించడంపై నిరాశ వ్యక్తం చేశారు. మరికొందరు ఆమెకు ధైర్యం చెబుతూ, భవిష్యత్తులో ఇంతకంటే మంచి అవకాశాలు వస్తాయని ప్రోత్సహించారు.