అమీర్ - పావని వివాహం చెల్లుబాటు కాదా?
అమీర్ ముస్లిం, పావని హిందువు. వీరిద్దరూ మతంతర వివాహం చేసుకున్నారు. కానీ మతంతర వివాహం చేసుకుంటే వారి వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోలేరని, దీనివల్ల వారి వివాహం చెల్లదని వివాదాస్పద సినీ జర్నలిస్ట్ బైల్వాన్ రంగనాథన్ ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడంతో, దానిపై తమిళనాడు ప్రభుత్వమే వివరణ ఇచ్చింది.