హీరోయిన్ సంఘవీతో రొమాన్స్.. తండ్రి చేత చీవాట్లు తిన్న విజయ్ దళపతి

Published : Jan 08, 2023, 01:09 PM ISTUpdated : Jan 08, 2023, 01:10 PM IST

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి టాప్ సీక్రేట్ వెల్లడించింది సీనియర్ హీరోయిన్ సంఘవి. తమ మధ్య జరిగి రొమాంటిక్ సీన్ గురించి సీక్రేట్ విప్పింది సంఘవి. 

PREV
16
హీరోయిన్ సంఘవీతో రొమాన్స్.. తండ్రి చేత చీవాట్లు తిన్న విజయ్ దళపతి

ఒకప్పడు హీరోయిన్ గా స్టార్ డమ్ తో వెలిగు వెలిగిన వారిలో హీరోయిన్ సంఘవి ఒకరు. ఈ సీనియర్ తార గురించి టాలీవుడ్ ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటుగా.. తమిళ, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది సంఘవి. 
 

26

అయితే తమిళంలో ప్రస్తుతం స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న విజయ్ తో కూడా నటించింది సంఘవి. విజయ్ గురించి చెపుతూ ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని పంచుకుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ హీరోయిన్.. పలు విషయాలు పంచుకుంది.  ఇంటర్వ్యూలో సంఘవి మాట్లాడుతూ..నేను విజయ్‌తో కలిసి తమిళంలో  రసిగన్‌ మూవీలో నటించాను. ఆ సినిమాని విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ డైరెక్ట్ చేశారు.

36

షూటింగ్ లో  భాగంగా ఇద్దరం ఓ  చెరువులో  రొమాంటిక్‌ సీన్‌ చేయాల్సి ఉంది. అయితే అక్కడే ఒక ప్రాబ్లమ్ వచ్చింది.. ఆ టైమ్ లో నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. లోపలికి దిగిగే వణుకు వచ్చేలా ఉన్నాయి. అటువంటి టైమ్ లో ఎక్స్ ప్రెషన్స్.. అది కూడా రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ చేయడం  చాలా కష్టం. కాని సీన్ ప్రకారం ఇద్దరం అందులో స్నానం చేసి రొమాన్స్ చేసుకుని బయటకురావాలి. 

46

 నాకు చల్లని నీళ్లు అలవాటే కాబట్టి పెద్దగా ఇబ్బందిపడలేదు..  సింపుల్‌గా ఆ సీన్  చేశాను. కాని ఆ రొమాంటిక్ సీన్.. చేయడానికి విజయ్‌ బాగా ఇబ్బంది పడ్డాడు. నీళ్లు బాగా చలిగా ఉండటంతో వణికిపోయాడు. అయితే ఆ సినిమాకు డైరెక్టర్ విజయ్ తండ్రే కావడంతో..ఇది చూసిన  చంద్రశేఖర్‌గారు  విజయ్ కు చీవాట్లు పెట్టారు.  అందరి ముందే తిట్టారు. 

56

సౌత్ లో స్టార్లుగా ఎదిగిన హీరోయిన్లు ఎక్కువగా కన్నడనాట నుంచి వచ్చినవారే. ఈక్రమంలో సంఘవి కూడా  కర్ణాటకలోని మైసూర్ కు చెందిన వ్యక్తి.  స్క్రీన్ నేమ్ సంఘవిగా పాపులర్ అయిన ఈ హీరోయిన్ అసలు పేరు మాత్రం  కావ్య . సఘవి  తండ్రి ఫేమస్  డాక్టర్ కావడంతో ఆమెను కూడా డాక్టర్ ను చేయాలి అనుకున్నారు. కాని ఈమె సినిమాల వైపు అట్రాక్ట్ అయ్యింది. 

66

ఈ క్రమంలో డాన్స్ నేర్చుకుంటున్న సంఘవి... దర్శకుడు సెల్వ కంట్లో పడింది. దీంతో ఆమెను ఎలాగైనా హీరోయిన్ ను చేయాలని అతను ఫిక్స్ అయిపోయాడు. తన సినిమా ద్వారా ఇంటడ్యూస్ చేశారు. ఇక అప్పటి నుంచి  దాదాపు 23 సంవత్సరాల పాటు సంఘవి హీరోయిన్ గా రాణించారు.
 

click me!

Recommended Stories