Heroine Sada: చివరికి సదా కూడా తెగిస్తుందిగా.. లేటు వయసులో జయం భామ ఘాటైన అందాలు!

Published : Jan 08, 2023, 11:50 AM ISTUpdated : Jan 08, 2023, 11:53 AM IST

ట్రెండ్ తో పాటు అప్డేట్ కావాల్సిందే. లేదంటే ఎవరూ పట్టించుకోరు. ఒకప్పుడు స్టార్ గా వెలిగిన సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు.   

PREV
18
Heroine Sada: చివరికి సదా కూడా తెగిస్తుందిగా.. లేటు వయసులో జయం భామ ఘాటైన అందాలు!
Sada

తెలుగు తెరపై సంప్రదాయ పాత్రలు చేశారు సదా. లంగా ఓణీలో సదా లుక్ అద్భుతంగా ఉండేది. జయం మూవీతో పాటు ప్రాణం, అపరిచితుడు చిత్రాల్లో ఆమె సేమ్ లుక్ ట్రై చేశారు. 
 

28
Sada

దర్శకులు ఆమెకు హోమ్లీ రోల్స్ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో సదా తన నయా అవతార్ ప్రదర్శిస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో కొత్త యాంగిల్ చూపిస్తుంది. సదా ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. చివరికి సదా కూడా తెగిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 
 

38
Sada


2002లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సదా.. వస్తూనే భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. జయం మూవీతో ఆమెకు మంచి ఆరంభం లభించింది. ఆ మూవీతో సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు.  తేజా దర్శకుడిగా తెరకెక్కిన జయం మూవీ సంచలన విజయం సాధించింది. నితిన్ కూడా ఇదే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. 

48
Sada


జయం మూవీ సదా(Sada)కు యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చింది. దానితో స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కాయి. నాగ చిత్రంలో ఎన్టీఆర్(NTR) తో జతకట్టారు సదా. అలాగే వీరభద్ర మూవీలో బాలయ్య(Balakrishna) పక్కన ఛాన్స్ కొట్టేశారు. ఈ రెండు విజయం సాధించలేదు.విజయాల శాతం తక్కువ కావడంతో సదా కెరీర్ త్వరగా డౌన్ అయ్యింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు. 

58
Sada

జయం తర్వాత సదా కెరీర్ లో అతిపెద్ద హిట్ అపరిచితుడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.అపరిచితుడు మూవీలో విక్రమ్ కి జంటగా సదా నటించారు. ఈ మూవీలో సదా అగ్రహారం అమ్మాయిగా చాలా పద్ధతి గల పాత్ర చేశారు. అపరిచితుడు రేంజ్ హిట్ సదాకు మరలా పడలేదు. 
 

68
Sada

ఇక చంద్రముఖి సినిమా నటించే ఛాన్స్ సదాకు మిస్ అయ్యిందట. డేట్స్ అడ్జెస్ట్ కాక చంద్రముఖి వదులుకున్నారట. ఆ సమయంలో తాను నటిస్తున్న సినిమా నిర్మాతను ఎంతగా బ్రతిమిలాడినా ఆయన కుదరదు అన్నాడట. చంద్రముఖి ఆఫర్ కోల్పోయినందుకు చాలా బాధపడ్డానని సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్ కెరీర్ లో చంద్రముఖి అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. 

78
Sada

సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు.  ఆమె వదిన, అక్క వంటి పాత్రలు చేయడానికి సిద్ధమయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తున్నారు.
 

88
Sada


అలాగే తెలుగు బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్నారు. ఈ మధ్య సదా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఏది ఏమైనా ఆమెకు ఆఫర్స్ దక్కి, సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.
 

click me!

Recommended Stories