మరో క్రేజీ హీరోయిన్ ని పట్టేసిన శింబు, ఇప్పటికీ మారని కోలీవుడ్ నవ మన్మథుడు

Published : Oct 19, 2022, 09:28 PM IST

తమిళనాట రొమాంటిక్ స్టార్ గా ఇమేజ్ ఉన్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవకసరం లేదు. ఆ ఇమేజ్ తోనే తన కెరీర్ న నాశనం చేసుకున్న శింబు.. ఇప్పటికీ ఆ ఆరా నుంచి బయట పడినట్టు లేడు. ఇప్పుడిప్పుడే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి అనుకున్న టైమ్ లో మరో క్రేజీ హీరోయిన్ ను పట్టేశాడట శింబు. 

PREV
17
మరో క్రేజీ హీరోయిన్  ని పట్టేసిన  శింబు, ఇప్పటికీ మారని కోలీవుడ్ నవ మన్మథుడు

కోలీవుడ్ స్టార్ హీరో శింబు రొమాంటిక్ ఇమేజ్  గురించి ఎంత చెప్పినా తక్కువే . గతంలో శింబు  చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. యంగ్ హీరోగా మంచి మంచి సినిమాలతో  బాక్స్ ఆఫీస్ వద్ద వరుస హిట్ల కొట్టుకుంటూ వెళ్లిన శింబు... అదే రేంజ్ లో హీరోయిన్లతో ప్రేమాయణాలు కూడా నడింపించాడు. కొంత మంది హీరోయిన్ లను బలవంతం చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ స్టార్ హీరోపై. ముఖ్యంగా హీరోయిన్ నయనతారతో శింబు లవ్ ట్రాక్ సంచలనం సృష్టించింది తమిళనాట. 

27

శింబు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తూ... ప్రొడ్యూసర్లకు  కాసుల వర్షం కురిపిస్తున్నాయి అనుకున్న టైమ్ లో ఆయన ఇమేజ్ అమాంతం పడిపోయింది. తన సినిమాలో నటించే హీరోయిన్స్ తో మిస్ బిహేవ్ చేయడం.. ప్రేమ పేరుతో వాడుకోవడం.. పెళ్లి విషయం వచ్చే సరికి వదిలేయడం లాంటివి చేశాడంటూ.. ఆరోపణలు..మీడియాలో వార్తలతో శింబు కెరీర్ బాగా డౌన్ అయ్యింది. ఆయన క్రేజ్ తగ్గిపోయింది. 

37

అంతేకాదు శింబుకు సబంధించిన కొన్ని రొమాంటిక్ ఫోటోలు,వీడియోలు బయటకు రావడంతో ఆయన పరువు పోయింది. దాంతో హీరోగా ఆయన పని అయిపోయింది అనుకున్న టైమ్ లో.. ఈమధ్య కాస్త పైకి లేస్తున్నాడు క్రేజీ హీరో. హీరోగా మానాడు లాంటి హిట్స్ పడటంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక పద్దతిగా సినిమాలు చేసుకుంటాడు అనుకుంటే .. మళ్లీ ప్రేమ కలాపాలు మొదలెటాడట క్రేజీ హీరో.  అతను ఇంకా మారలేదు అంటున్నారు కోలీవుడ్ జనాలు. 

47

శింబు  మాటలకి ఎలాంటి అమ్మాయి అయిన పడిపోవాల్సిందే.. అంటున్నారు ఆయన రొమాంటిక్ ఫ్యాన్స్. ఈ మధ్య వరకూ హన్సికాతో ప్రేమ పెళ్లి అంటూ న్యూస్ వినిపించింది. కాదు కాదు నిథి అగర్వాల్ లో పెళ్ళి అయిపోయింది అన్నారు. కాని అందరికి షాక్ ఇస్తూ..రీసెంట్ గా శింబు ఖాతాలో మరో హీరోయిన్ చేరిన్నట్లు తెలుస్తుంది. 

57

ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరో కాదు హీరోయిన్ కీర్తి  సురేష్ అని అంటున్నారు . ఈ మధ్య పక్కా కమర్షియల్ గా తయారయ్యింది  కీర్తి. మహానటి ఇమేజ్ నుంచి బయటపడి.. కమర్షియల్ సినిమాలతో పాటు.. హాట్ ఫోటోలకు కూడా పోజులిచ్చేస్తోంది బ్యూటీ. ఇక  కీర్తి సురేష్ ప్రస్తుతం శింబు మాయలో పడిపోయింది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 
 

67

త్వరలోనే ఈ ఇద్దరు స్టార్లు కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. ఈలోపు కీర్తితో పులిహార కలిపే కార్యక్రమం పెట్టుకున్నాడట శింబు. అంతేనా ఇందులో భాగంగానే కీర్తి సురేష్ బర్త్ డే ను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడట శింబు.  మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలయదు కాని శింబు ట్రాప్ లో పడితే మాత్రం లైఫ్ అంతే అంటున్నారు జనాలు. 

77

కీర్తి సురేష్ కు మంచి కెరీర్ ఉంది.. కాస్త అది ఆలోచించుకో అంటూ సలహాలు ఇస్తున్నారు. అంతే కాదు ఈ శింబు ఇంకా మారడా..? ఇంత జరిగినా.. ఇంకా అదే యావా.. కెరీర్ పై ఆలోచనల లేదా అంటూ..? రకరకాల కమెంట్లు వినిపిస్తున్నాయి తమిళనాట. 

Read more Photos on
click me!

Recommended Stories