పూజా హెగ్డే కొంప ముంచిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దిక్కు తోచని స్థితిలో హీరోయిన్ కెరీర్ ....?

First Published | Oct 19, 2022, 7:40 PM IST

పాపం పూజా హెగ్డే మరోసారి ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది. వరుస ఫెయిల్యర్స్ తో అగమ్య గోచరంగా మారిన పూజా హెగ్డే కు మరో షాక్ తగిలింది. తెలుగు స్టార్ డైరెక్ట్  వల్ల పూజా కెరీర్ ఇబ్బందులో పడిందట.
 

మొదట్లో ఫెయిల్యూర్ హీరోయిన్ గా ముద్ర పడిన పూజా హెగ్డే.. ఆరువాత కొంత కాల టాలీవుడ్ ను ఏలింది. స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సాధించి.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మరిన పూజా.. అటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు సాధించింది. 

ఇక రీసెంట్ గా వరుస ఫెయిల్యూర్స్ తో డేంజర్ జోన్ లో పడింది పూజా. అందులోను పాన్ ఇండియా సినిమాలు కూడా పెవీలియన్ చేరడంతో.. పూజా కెరీర్ పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. దాని తోడు ప్రస్తుతం ఆమె బాలీవుడ్ అంటూ కలలు కంటూ.. తెలుగు సినిమాలు నెగ్లెట్ చేస్తుందన్న విమర్ష కూడా ఉంది. 


ఈ మధ్యలోనే పూజా మూడు డిజా్స్టర్స్ ను ఫేస్ చేసింది. తమిళంలో స్టార్ హీరో విజయ్ తో చేసి బీస్ట్ మూవీ... ఇటు తెలుగులో ప్రభాస్ తో చేసిన పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ తో పాటు.. మెగా మూవీ ఆచార్య కూడా డిజాస్టర్ అవ్వడంతో పూజాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఐరెన్ లెగ్ హీరోయిన్ అని మళ్ళీ పేరు పడింది. 

ఇది ఇలా ఉంటే... మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. అసలే పరాజాయాల పాలు అవుతున్న పూజాకు...పూరీ దెబ్బ గట్టిగా పడింది. డైరెక్టర్ పూరీ  జగన్నాథ్  డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . లైగర్ ప్లాప్ తో ఆ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టాడట పూరీ జగన్నాథ్. అంతే కాదు హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపించడలేదట.  

ఇన్ని ఇబ్బందుల మధ్య జనగణమన తీయ్యడం కష్టం అని భావించాడట పూరి జగన్నాథ్. అంతే కాదు జనగణమన నిర్మాతలు కూడా ఇందులోంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఈ ప్రాజెక్టును ఆపేసాడని త్వరలోనే తన కొడుకుతో భారీ సినిమాను పూరీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తుంది.
 

అయితే ఈ  ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. అటు పూరి.. ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరు బాగానే ఉన్నారు. ఈ సినిమాతో అయినా తనేంటో నిరూపించుకుని.. మళ్ళీ ఫామ్ లోకి రావాలి అనుకన్న పూజా హెగ్డే మాత్రం పాపం అయిపోయింది. అసలే వరుస ఫెయిల్యూర్స్ తో ఫామ్  కోల్పోతున్న ఈ బ్యూటీ చేయాల్సి సినిమా ఆగిపోతే.. ఇక ఐరెన్ లెగ్ అనే ముద్ర వేస్తార్ర భయంతో సతమంతం అవుతోందట. 

 సినిమాను వదులుకున్న విజయ్ దేవరకొండ బాగానే ఉన్నాడు.. చేయాలకున్న పూరీ బాగానే ఉన్నాడు. ఈ  ఇద్దరు స్టార్లు వేరువేరు ప్రాజెక్టులు బిజీ అయిపోతున్నారు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా  సెలెక్ట్ అయిన పూజ హెగ్డే మాత్రం ఐరెన్ లెగ్ అయిపోయింది. ఈ విషయంలో తెగ బాధపడిపోతుందట పూజా

ఇప్పుడు ఆమె ఓకే చేసిన సినిమాలు కూడా ఆగిపోతున్నాయి .దీంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. దీంతో పూరి జగన్నాథ్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే కు అన్యయం చేశావంటూ.. ఆమె ఫ్యాన్స్ మండి పడుతున్నారు. 

Latest Videos

click me!