అక్క స్లో అయ్యిందీ చెల్లెలు రంగంలోకి దిగుతుంది...యాంకర్ గా ఎంట్రీ ఇస్తున్న అనసూయ చెల్లి వైష్ణవి!

Published : Oct 19, 2022, 08:04 PM ISTUpdated : Oct 19, 2022, 08:21 PM IST

యాంకర్ గా కెరీర్ లో హైట్స్ చూసిన అనసూయ తన వారసురాలిగా చెల్లిని దించుతుందట. వైష్ణవి యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్దమట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.   

PREV
16
అక్క స్లో అయ్యిందీ చెల్లెలు రంగంలోకి దిగుతుంది...యాంకర్ గా ఎంట్రీ ఇస్తున్న అనసూయ చెల్లి వైష్ణవి!
Anasuya Bharadwaj

యాంకరింగ్ హిస్టరీలో అనసూయ ఒక సంచలనం.తెలుగు బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన ఘనత అనసూయదే. ఆమె రాకముందు యాంకర్ అంటే పద్ధతిగా చీర కట్టుకోవాలి, చుడిదార్ వేసుకోవాలి, శరీరం కనిపించకుండా ఫుల్ కవర్ చేయాలి అనే నిబంధనలు ఉండేవి. తెలుగు యాంకర్స్ దాదాపు ఇదే ట్రెండ్ ఫాలో అయ్యేవారు.

26
Anasuya Bharadwaj


జబర్దస్త్ షో యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైన అనసూయ సంచనాలు చేసింది. పొట్టి బట్టల్లో ప్రేక్షకులకు పిచ్ కిక్ ఇచ్చింది. ఎన్ని విమర్శలు వచ్చినా వెరవకుండా తన గ్లామర్ పవర్ చూపించింది. ఒక్క షోతో స్టార్ యాంకర్ హోదా పట్టేసిన అనసూయ బుల్లితెర స్టార్ అయ్యారు. 

36
Anasuya Bharadwaj


యాంకర్ గా వచ్చిన ఇమేజ్ తో నటిగా రాణిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న అనసూయ... హీరోయిన్ గా ప్రధాన పాత్రలు చేయడం విశేషం. అనసూయ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అలాగే కొన్ని వెబ్ సిరీస్లలో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ ని కూడా పక్కన పెట్టింది. 
 

46
Anasuya Bharadwaj

తనకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఏదో పేరుకు ఒకటో రెండో షోస్ చేస్తుంది. వాటిని కూడా వదిలేసే సూచనలు కలవు. యాంకరింగ్ నుండి రిటైర్ కావాలనుకుంటున్న అనసూయ వారసురాలిని దించుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చెల్లెలు వైష్ణవి అరంగేట్రానికి సర్వం సిద్ధమన్న న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 
 

56
Anasuya Bharadwaj

అనసూయకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వారిలో ఒకరైన వైష్ణవి త్వరలో జీ తెలుగులో ప్రసారం కానున్న కొత్త షోతో యాంకర్ గా ఎంట్రీ ఇస్తున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి అదే నిజమైతే బుల్లితెర ప్రేక్షకులకు మరో గ్లామరస్ యాంకర్ దొరికినట్లే.

66
Anasuya Bharadwaj

ఇక అనసూయ కెరీర్ హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ గా ప్రారంభమైంది. అనంతరం సాక్షి ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేశారు. ఆ సమయంలో సినిమా ప్రయత్నాలు కూడా చేశారు. జబర్దస్త్ షోకి యాంకర్ ఎంపికైన అనసూయ జీవితం మారిపోయింది. ఆ షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. హీరోయిన్ స్థాయికి ఎదిగేలా చేసింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories