తమిళంలో “కల్కి” బుక్కింగ్స్ అంత దారుణమా, కారణం ఆ పొరపాటేనా?

First Published Jun 25, 2024, 7:46 AM IST

కల్కి సినిమా( Kalki 2898 AD ) బుకింగ్స్ తమిళనాడులో చాలా  ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న తెలుగువారు మాత్రమే ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. 

Kalki

ప్రభాస్ హీరోగా   దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి”. ఎన్నో అంచనాలతో మరో రెండు రోజుల్లో రిలీజ్ కి రాబోతున్న ఈ చిత్రంకి వరల్డ్ వైడ్ గా భారీగానే బిజినెస్ జరుపుకుంది.  తెలుగు సహా హిందీ, తమిళ్ లో కూడా గ్రాండ్ గానే రిలీజ్ కాబోతుంది. అన్నిచోట్లా బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి. చాలా వేగంగా టిక్కెట్లు అమ్ముడు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పక్కర్లేదు. కానీ మన ప్రక్క రాష్ట్రమైన తమిళనాట మాత్రం ఈ చిత్రం పై బజ్ వినపడటం లేదు. దాంతో అక్కడ రైట్స్ తీసుకున్నవారు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. 

తమిళంలో కల్కి హక్కులుని  శ్రీ లక్ష్మి మూవీస్ వారు సొంతం చేసుకున్నారు. అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు షేర్ రావాలి. అంటే మినిమం 40 కోట్ల గ్రాస్ రావాలి. అయితే ఇప్పుడున్న సిట్యువేషన్ ని బట్టి చూస్తుంటే కష్టమే అంటున్నారు. అయితే సినిమా టాక్ బయిటకు వచ్చి పికప్ అయితే బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. అప్పుడు రికవరీ ఉంటుంది. వాస్తవానికి కమల్ హాసన్ సినిమాగా తమిళులు దీన్ని చూస్తారని నిర్మాతలు భావించారు. కానీ ప్రభాస్ హైలెట్ కావటంతో కమల్ ని హైడ్ చేయటంతో ప్రమోషన్ పరంగా సమస్యలు వస్తున్నాయి.  ఇది కొద్దిగా ట్రేడ్ ని భయపెట్టే విషయమే. 
 

Latest Videos


ప్రస్తుతానికి అయితే  కల్కి సినిమా( Kalki 2898 AD ) బుకింగ్స్ తమిళనాడులో చాలా  ఘోరంగా ఉన్నాయి.అక్కడ ఉన్న తెలుగువారు మాత్రమే ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ లోకల్ తమిళులు మాత్రం ఈ సినిమాని పట్టించుకోవటం లేదు.  ఓ డబ్బింగ్ సినిమాగా ప్రక్కన పెట్టేస్తున్నారు. అందులోనూ కమల్ పాత్ర పెద్దగా లేదనే టాక్ కూడా వారిని ఈ సినిమాకు దూరం చేస్తోంది. అందుకు తగినట్లే ప్రమోషన్స్ లోనూ కమల్ ని హైలెట్ చేయటం లేదు. దాంతో హిందీలోనూ వేరే భాషల్లోనూ కల్కి కి ఉన్న డిమాండ్ తమిళనాడులో అస్సలు కనిపించడం లేదు.

జూన్ 24 దాకా ఈ సినిమా తమిళనాట ప్రీ సేల్స్ చూస్తే 50 లక్షల గ్రాస్ మాత్రమే కనిపించింది. అలాగే 15% మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. అంటే ఈ సినిమా ఓపినింగ్స్ బాగా డల్ గా ఉండబోతున్నాయన్నమాట. అదే హిందీ బెల్ట్ కు వచ్చేసరికి బీహార్, గుజరాత్ ల లో ఓపినింగ్స్ అదరకొడుతున్నాయి. తమిళనాట కమల్ మేనియా వర్కవుట్ అవుతుందని భావించిన నాగ్ అశ్విన్ అక్కడ అసలు బజ్ లేకపోవటాన్ని చూసి విస్తుపోతున్నారట. అయినా సినిమా రిలీజ్ అయ్యాక సాయింత్రానికే కలెక్షన్స్ పుంజుకుంటాయని నమ్ముతున్నారు. మరీ ముఖ్యంగా తమిళనాట ప్రమోషన్స్ ని కూడా చేయలేదు.  అదో పెద్ద దెబ్బ. 

తెలుగుకు వచ్చేసరికి ప్రభాస్ ఒక్కడు చాలు, మిగతా వాళ్లను పట్టించుకోరు. దానికి తోడు తెలుగులో ప్రతిష్టత్మకమైన బ్యానర్, మహానటి వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు కావటం సరిపోతుంది. అదే నార్త్ సైడ్ కూడా ప్రభాస్ కు బాహుబలి,సాహో చిత్రాలతో బోలెడు ఇమేజ్ వచ్చింది. అలాగే దీపికా పదుకోని, దిశా పటాని, అమితాబ్ వంటి మహానటుడు ఉండటం ప్లస్ అవుతోంది. ఇక తమిళంలో ప్రభాస్ కన్నా కూడా  కమల్ కు క్రేజ్ ఎక్కువ.

Prabhas Kalki 2898

 కమల్ ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ తో ఉన్నారు. నిన్న జరిగిన  ఈవెంట్ లో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ గారిలా ఆర్డినరీగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్.పైకి సాధారణంగా కనిపించే వారంతా అసాధారణమైన పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ తో కాసేపు మాట్లాడగానే అతని టాలెంట్ ఏంటనేది తెలిసిపోతుంది. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి ఉంది.

Kalki 2898 AD Trailer

 ఇందులో బ్యాడ్ మ్యాన్ గా కనిపిస్తాను. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నా పాత్రని నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు. నా లుక్ కోసం చాలా రీసెర్చ్ చేశాం. ఆడియన్స్ నా పాత్రని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

  కలి పురుషుడు అన్నట్లుగా భయంకర రూపంతో కమల్ హాసన్ పాత్రని చూపించారు. మొదటి ట్రయిలర్ కి కొత్త ట్రైలర్ కి ఆయన రూపంలో కాస్త వ్యత్యాసం ఉంది. ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఉపయోగించే భారీ ఆయుధాలు, ఆ విజువల్స్ విజువల్ ఫీస్ట్ అన్నట్లుగా ఉన్నాయి. ఓవరాల్ గా హిందూ పురాణాల అంశాలు, కల్కి అవతారం, భారీ యాక్షన్ సీన్లు అన్ని కలగలిపిన హాలీవుడ్ స్థాయి చిత్రాన్ని చూడబోతున్నాం అని మాత్రం చెప్పొచ్చు. 

Prabhas Kalki 2898 AD film

అలాగే కల్కి చిత్రం స్టార్ట్ అయ్యే ముందు ఎంతో ఆసక్తిగా ఉన్నా, అప్పుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. ఇప్పుడు విస్మయంలో ఉన్నా అని అన్నారు. కమల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కనిపించనున్నారు.  

click me!