అమీర్ ఖాన్ కొడుకు లాంచింగ్ ఫిల్మ్ 'మహారాజ్' రివ్యూ!

First Published | Jun 25, 2024, 6:29 AM IST

ఈ చిత్రం రిలీజ్ కు ముందు మత పరమైన వివాదాలతో కోర్ట్ కు సైతం వెళ్లింది. ఇలా అందరిలో ఆసక్తిరేపిన ఈ చిత్రం నెట్ ప్లిక్స్ లో డైరక్ట్ రిలీజ్ చేసారు. 

Maharaj Movie REVIEW


అమీర్ ఖాన్ ఎంత గొప్ప నటుడో, ఎంత పర్పెక్షనిస్ట్ అనేది  మనందరికీ తెలుసు. కేవలం తన నటనతో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇన్నేళ్లుగా పరిశ్రమలో నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన కుమారుడు జునైద్ ఖాన్ సైతం హీరోగా పరిచయం అయ్యారు.  బాలీవుడ్‌ మెగా ప్రొడక్షన్ హౌస్ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. అలాగే ‘పాతాల్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో మన ముందుకు వచ్చిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు మత పరమైన వివాదాలతో కోర్ట్ కు సైతం వెళ్లింది. ఇలా అందరిలో ఆసక్తిరేపిన ఈ చిత్రం నెట్ ప్లిక్స్ లో డైరక్ట్ రిలీజ్ చేసారు. ఈ సినిమా కథేంటి, చూడదగ్గ కంటెంట్ ఉన్న సినియేనా, అమీర్ ఖాన్ కొడుకు ఎలా చేసాడు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్  

1890లలో కర్శన్ దాస్ (జునైద్ ఖాన్)అనే గుజరాతి జర్నలిస్ట్, రైటర్, సంఘ సంస్కర్త ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతూంటాడు. వైష్ణవ సంప్రదయ కుటుంబంలో జన్మించిన అతను తన పత్రిక సత్య ప్రకాశ్ తో ఎక్కడెక్కడి నిజాలను వెలికి తీస్తూంటాడు. అది చాలా మందికి నచ్చదు. మరీ ముఖ్యంగా అక్కడ కృష్ణ మందిరంలో ఉండే మతాచార్యుడు మహారాజ్ (జైదీప్ అహ్లావత్) కు నచ్చదు. జాదూనాథ్ మహారాజ్ అతని పేరు అందరూ ఆయన్ని జేజే అని పిలిచి దేవుడు కన్నా ఎక్కువగా కొలుస్తూంటాడు. అతను దేవాలయానికి చాలా ఫండింగ్ తెచ్చి ఉంటాడు. ఓ రాజ సౌధంలా ఆ దేవాలయాన్ని తీర్చి దిద్దుతాడు. 


Maharaj Movie


అయితే జేజేకి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. అదొక సంప్రదాయంగా చెప్తూంటాడు. పెళ్లికు ముందే తనతో ఉంటే ఆశీస్సులు లభిస్తాయని, దాని పేరు చరణ సేవ అని, ఆ అదృష్టం ఎవరికో గానీ పట్టదు అని ప్రచారంలో ఉంటుంది. అయితే ఆ ఆచారం అతనితోనే ఉండదు. అంతకు ముందు ఆచార్యులు కూడా అలాగే చేసి ఉంటారు. దాంతో భక్తులు అంతా సంప్రదాయంగానే ఏక్సెప్ట్ చేసి తన కూతుళ్లను, చెళ్లిల్లను చరణ సేవకు పంపుతూంటారు. ఆ చరణ సేవను డబ్బులు ఇచ్చి మరీ దొంగచాటుగా మరికొందరు భక్తులు కిటికీటల నుంచి చూస్తూంటారు. భక్తి ముసుగులో ఒకరి ఇష్టా అయిష్టాలకు సంభంధం లేకుండా ఇలా సాగిపోతూ ఉంటుంది. 

Maharaj Movie


అయితే ప్రతీదానికి ఓ ముగింపు అనేది ఉంటుంది. మన జర్నలిస్ట్ హీరో కర్శన్ ప్రియురాలు కిషోరి(షాలినీపాండే)కూడా జేజే పడగగదిలోకి చరణ సేవకు వెళ్తుంది. దాన్ని కళ్లారా చూసిన కర్శన్ తట్టుకోలేకపోతాడు. తన పత్రిక ద్వారా జేజే నిజ స్వరూపం చూపటానికి కథనాలు ప్రచురిస్తాడు. వాటిని మొదట అడ్డుకుంటాడు జేజే. కానీ అతని వల్ల కాదు. దాంతో ఈ పేపర్లో వచ్చే కథనాలతో తన పరువు పోతుందని, తన ప్రతిష్ట మసకబారుతుందని భావించి ఆ కథనాలపై కోర్టుకు ఎక్కుతాడు.

Maharaj Movie


అప్పటి బోంబే కోర్టులో బ్రిటీష్ జడ్జిలు లాయిర్లు ఉంటారు. కర్శన్ పై యాభై వేలు పరువు నష్టం దావా వేస్తాడు.  కర్శన్ దాస్ కూడా లాయిర్ ని పెట్టుకుంటాడు. ఆదర్శవాది అయిన కర్శన్ దాస్ తన వాళ్ల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు. మన మతం పరువు తీస్తున్నామంటారు. వెళ్లి జేజేకు క్షమాపణ చెప్పమంటారు. కర్శన్ దాస్ చెప్పనంటాడు. జేజే సాక్ష్యాలు మాయం చేసేస్తాడు. అయితే అతని అహంకార పూరిత ధోరణితో కోర్టులో దొరికిపోతాడు. అప్పుడు ఏమైంది. కోర్టు తీర్పు ఏమని ఇచ్చింది. కర్శన్ దాస్ కోర్టు తీర్పులో బయిటపడ్డాడా, అతని ప్రియురాలు కిషోరి ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Maharaj Movie


విశ్లేషణ

ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా బయిటకు వస్తుందనే నమ్మకం లేదు.  హిందూ మ‌తాన్ని, ఆచారాలు, సంస్కృత‌ల‌ను మ‌హారాజ్ మూవీతో వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసినట్లు కోర్టుకు ఎక్కారు. అయితే గుజరాత్ కోర్టు మూవీని చూసి అందులో అంత వివాదాస్పద విషయం ఏమి లేదని, మేకర్స్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త కర్సన్ దాస్ ముల్జీ జీవితం ఆధారంగా గుజరాతీ రచయిత సౌరభ్ షా రచించిన 1862 మహారాజ్ లిబెల్ కేస్ అనే పుస్తకం ఆధారంగా మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెరక్కించారు.  
 

Maharaj Movie

ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నాడు వాస్తవకంగా జరిగిన కథ అయ్యిండవచ్చు కానీ ఇప్పటికాలంలోనూ ఇలాంటి సంఘటనలు చెదురు మదరుగా జరుగుతూనే ఉన్నారు. ఆ మధ్యన ఆశారాం బాపూజి, డేరా బాబా ఇలా పెద్ద లిస్టే ఉంది. అది ప్రక్కన పెట్టి సినిమాగా చూస్తే ఇదొక డాక్యుమెంటరీ నేరేషన్ లో చెప్పుకుపోయినట్లు ఉంటుంది కానీ సినిమా చూసినట్లు అనిపించదు. ఆ ఇంపాక్ట్ కనపడలేదు. నేచురల్ గా తీయాలనే తపనతో సినిమాటెక్ ఎలిమెంట్స్ ని మిస్ చేసి ఆ ఫీల్ ని పోగొట్టేసారు. 

Maharaj Movie


అలాగే సిననిమాలో పెద్ద సెట్స్, అందంగా కొరియోగ్రఫీ చేయబడ్డ డాన్స్ సీక్వెన్స్ లు వీటికే ప్రయారిటీ ఇచ్చారు. అసలు కథకు డ్రామాని వెనక్కి నెట్టేసారు. స్టోరీ టెల్లింగ్ ఇంకాస్త పవర్ ఫుల్ గా ఉండాల్సింది. అయితే కోర్ట్ లో క్లైమాక్స్ సీన్ బాగా పండింది. అక్కడ జేజే తన సింహాసనం మీద ఓ రకమైన నవ్వుతో జడ్జి ఎదురుగా కూర్చోవటం , తనను ఏదైనా చేస్తే తన భక్తులు ఊరుకోరు అని కూల్ గా వార్నింగ్ ఇవ్వటం కట్టిపారేస్తుంది. జరిగిన సంఘటనని తెరకెక్కించటంతో చెప్పుకోదగ్గ ట్విస్ట్ లు, టర్న్ లు సినిమాలో లేవు, ఉన్న ఒకటి రెండు ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. 

Maharaj Movie


ఫెరఫార్మెన్స్ ల విషయానికి వస్తే...

జునైద్ ఖాన్..ప్రతీ ఫ్రేమ్ లోనూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే తపనతోనే కనిపించాడు. ఓ రకంగా స్క్రీన్ పై ఫ్రెష్ గా అనిపించాడు. అయితే అమీర్ ఖాన్ తో పోల్చనంతసేపు అతని నటన నచ్చుతుంది. అమాయకత్వం , ఏదో చెయ్యాలనే తపన,కొన్ని సార్లు మొండి ధైర్యం ఇవన్ని అతని నటనలో చూపించాడు. ముఖ్యంగా కోర్ట్ రూమ్ లో డైలాగులు చెప్పిన విధానం నచ్చుతుంది. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే విషయానికి వస్తే ఆమె కొన్ని సీన్స్ లో జేజే తో ఉన్నప్పటివి తనలోని నటిని పూర్తిగా ఆవిష్కరించింది. జేజే మహరాజ్ గా జైదీప్ అహల్వాత్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఆ క్రూరత్వంతో నవ్వే నవ్వు మనని చాలా రోజులు గుర్తుండిపోయేలా చేస్తుంది. మిగతా ఆర్టిస్ట్ లు సోసోగా చేసుకుంటూ పోయారు.

Maharaj Movie


టెక్నికల్ గా 

అమీర్ ఖాన్ కొడుకు లాంచ్ అవ్వదగ్గ గొప్ప సినిమా అయితే కాదు. ఇలాంటి ఇష్యూలతో రీసెంట్ గా Ek Banda Kaafi Hai వచ్చింది. పోలిక అనికాదు కానీ జస్ట్ ఓకే సబ్జెక్టు. స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్ గా ఉంది. డైరక్షన్ లో పంచ్ లేదు. ఆడియన్స్ ని కదిలించే సీన్స్ లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి. టెక్నికల్ గా కూడా అద్బుతం కాదు. కెమెరా వర్క్, కొన్ని లావిష్ సెట్లు తప్పించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం బాగా చేసారు.

Maharaj Movie


ఫైనల్ థాట్

సినిమా చూసాక ఆ రోజుల్లో కూడా ఇలాంటి దారుణాలు జరిగేవా అనే ఓ చిన్న నిట్టూర్పు వస్తుంది. అదే దర్శకుడు ఆశిస్తే సినిమా సక్సెస్ అయ్యినట్లే. అంతకు మించి అయితే కష్టమే.
 
Rating: 2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఏ ఓటిటిలో ఉంది

నెట్ ప్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ దొరుకుతోంది.

Latest Videos

click me!