అనుష్కకి వింత జబ్బు.. షూటింగ్ సెట్‌లో ఇబ్బంది పెడుతున్న స్వీటి.. చూస్తే నవ్వాగదు!

First Published Jun 25, 2024, 7:20 AM IST

అనుష్క శెట్టి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. దాని కారణంగా షూటింగ్‌లో ఇబ్బంది అవుతుంది. దర్శకుడు షూటింగ్‌ ఆపేసుకోవాల్సి వస్తుందట. 
 

Anushka Shetty

తెలుగు తెర స్వీటి.. అనుష్క శెట్టి. ఆమెని అభిమానులు ముద్దుగా స్వీటి అని పిలుచుకుంటారు. ఆమె ప్రవర్తన, మంచి తనం, నిజాయితీ ఇలా అన్నీ స్వీటిలాగే ఉంటుంది. అందుకే ఆమెకి ఆ పేరుని ఫిక్స్ చేశారు. తను కూడా స్వీటిలానే అలరిస్తుంది. అందం, అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. 
 

 ఇదిలా ఉంటే అనుష్క శెట్టి ఇన్నాళ్లు బరువు సమస్యతో బాధపడుతుంది. అధిక బరువు కారణంగా ఆమె ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. `సైజ్‌ జీరో` సినిమా సమయంలో ఆమె చేసిన అధిక బరువు పెరగడం, సన్నబడటం వంటి ప్రయోగం బెడిసి కొట్టింది. సినిమాల్లో మాదిరిగానే రియల్‌ లైఫ్‌లోనూ అనుష్క ఆ సమస్యని ఫేస్‌ చేసింది. చేస్తుంది. 

Latest Videos


ఇప్పటికీ ఆమె బరువు విషయంలో ఇంకా పూర్తిగా సెట్‌ కాలేదు. బరువు తగ్గలేకపోతుంది. అందుకోసమే ఆమె సినిమాలు కూడా తక్కువగా చేస్తుంది. బయటకు కూడా రావడం లేదు. అయితే ఇటీవల బరువు కంట్రోల్‌లోకి రావడంతో బయటకు వచ్చింది. మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులో క్రిష్‌తో `ఘాటి` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే కావడం విశేషం. ప్రస్తుతం ఇవి చిత్రీకరణ దశలో ఉన్నాయి. 
 

అయితే అనుష్కకి మరో సమస్య ఉంది. ఓ వింత జబ్బు వెంటాడుతుందట. ఓ ఇంటర్వ్యూలో అనుష్క ఆ విషయాన్ని వెల్లడించింది. తనకు లాఫింగ్‌(నవ్వు) సమస్య ఉందట. నవ్వడం ప్రారంభిస్తే ఆపడానికి పది పదిహేను నిమిషాలు అవుతుందట. నవ్వు తెప్పించే సన్నివేశాలు చూసినప్పుడు, కామెడీ సీన్లు చూసినప్పుడు అదే పనిగా నవ్వుతుందట. ఎంత కంట్రోల్‌ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతుందట. ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే పదిహేను, ఇరవై నిమిషాలపాటు కంటిన్యూగా నవ్వుతూనే ఉంటుందట. 
 

Anushka Shetty

ఈ సమస్య కారణంగా చాలా సందర్భాల్లో షూటింగ్‌లకు అంతరాయం కలిగేదట. షూటింగ్‌ టైమ్‌లో సెట్‌లో ఇలా నవ్వేలా ఏదైనా కామెడీ సీన్‌ చోటు చేసుకున్నప్పుడు కంటిన్యూగా ఆమె నవ్వుతూనే ఉండటం వల్ల షూటింగ్‌ని ఆపేయాల్సి వస్తుందట. ఆమె నవ్వు ఆపాక షూటింగ్‌ చేయాల్సి వస్తుందని అనుష్కనే ఆవేదన వ్యక్తం చేసింది. నవ్వు యోగం, భోగం అంటుంటారు. కానీ అతి నవ్వు పలు అనార్థాలకు దారి తీస్తుంది. దీన్ని సైన్స్ భాషలో చెప్పాలంటే `సూడో బుల్బార్‌ ఎఫెక్ట్(పీబీఏ) అంటారు. ఇదొక నాడీ సంబంధిత సమస్య. దీని కారణంగా అతి నవ్వు, అతి ఏడుపు కలుగుతుందట. ఇది మెదడు గాయం లేదా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వంటి అంతర్లీన నరాల వ్యాధి ఫలితంగా కలిగే రుగ్మత అని డాక్టర్లు చెబుతున్నారు. మరి అనుష్క దాన్నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. 

అనుష్క గతేడాది.. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించారు. నవీన్‌ పొలిశెట్టికి జోడీగా చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు క్రిష్‌ దర్శకత్వంలో `ఘాటి` సినిమాలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. అది కూడా షూటింగ్‌ జరుపుకుంటుంది. 

click me!