`హ్యాపీడేస్‌` రోజులను గుర్తు చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. లైఫ్‌ ఇచ్చిన దర్శకుడితో..

Published : Mar 18, 2021, 02:30 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా.. `హ్యాపీడేస్‌` రోజుల్లోకి వెళ్లిపోయింది. తనకి లైఫ్‌ ఇచ్చిన దర్శకుడి వద్ద వాలిపోయింది. అనేక కబుర్లు పంచుకుంది. ఆనాటి రోజులను గుర్తు చేసుకుని అనుభూతిని పొందింది. తన ఆనందాన్ని తనకే పరిమితం చేయకుండా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. 

PREV
17
`హ్యాపీడేస్‌` రోజులను గుర్తు చేసుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. లైఫ్‌ ఇచ్చిన దర్శకుడితో..
తమన్నా దర్శకుడు శేఖర్‌ కమ్ములని కలిసింది. ఈ సందర్భంగా తన ఎగ్జైట్‌మెంట్‌ని షేర్‌ చేసుకుంది. దాదాపు 14ఏళ్ల తర్వాత తనకి లైఫ్‌ ఇచ్చిన దర్శకుడిని కలిసి సంతోషాన్ని పంచుకుంది తమన్నా. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను అభిమానులతో షేర్‌ చేసింది.

27
ఇందులో `నేను ఎవరిని బంప్‌ చేశానో చూడండి. శేఖర్‌ కమ్ముల సర్‌. నాజీవితంలో `హ్యాపీడేస్‌` ప్రారంభించిన వ్యక్తి. తన రాబోయే చిత్రం `లవ్‌ స్టోరి` కోసం సూపర్‌ ఎగ్జైటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నా. నాగచైతన్య, సాయిపల్లవిలకు అభినందనలు` అని పేర్కొంది.

37
మిల్కీ బ్యూటీ `శ్రీ` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగుపెట్టినా, `హ్యాపీడేస్‌`తోనే హిట్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. తనకంటూ ఓ గుర్తింపుని దక్కించుకుంది. అప్పటి నుంచి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.

47
జయాపజయాలకు అతీతంగా సినిమాలు చేస్తూ తన అద్భుతమైన డాన్స్ లతో మెప్పిస్తుంది. దాదాపు అందరు స్టార్‌ హీరోలతోనూ ఆడిపాడింది తమన్నా. స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే తన జీవితంలో హ్యాపీడేస్‌ని ప్రారంభించిన దర్శకుడు శేఖర్‌ కమ్ములతో మళ్లీ ఆమె సినిమా చేయలేదు. బహుశా కలుసుకోవడం కూడా చాలా రేర్‌ అనే చెప్పాలి.

57
స్టార్‌ హీరోయిన్‌గా బిజీగా ఉన్న తమన్నా, మొదటి రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపింది. పాత రోజులకు వెళ్లి ఆనాటి తీపిగుర్తులను గుర్తు చేసుకుంది. శేఖర్‌ కమ్ములతో తమన్నా కన్వర్జేషన్‌ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.

67
ఇక శేఖర్‌ కమ్ముల రూపొందించిన `లవ్‌స్టోరి` చిత్రం ఏప్రిల్‌ 16న విడుదల కానుంది. ఇందులోని `సారంగ దరియా` పాట ఇప్పటికే విడుదలై శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. ఇది యాభైకి పైగా మిలియన్‌ వ్యూస్‌ని సొంతం చేసుకోవడం విశేషం.

77
తమన్నా ప్రస్తుతం గోపీచంద్‌తో `సీటీమార్‌`, నితిన్‌తో `అంధాధున్‌` రీమేక్‌, `గుర్తుందా శీతాకాలం`, `ఎఫ్‌3`, `బోల్‌ చుడియన్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories