‘హరిహర వీరమల్లు’ వచ్చేది కష్టమే అని తేలిపోయింది

Published : Mar 01, 2025, 05:39 AM IST

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. మ్యాడ్ స్క్వేర్ నిర్మాత నాగవంశీ, హరిహర వీరమల్లు వస్తే తమ సినిమా విడుదల కాదని స్పష్టం చేశారు.

PREV
13
  ‘హరిహర వీరమల్లు’ వచ్చేది కష్టమే అని తేలిపోయింది
Will Mad Square clash with Hari Hara Veera Mallu? Here the clarity in telugu


Hari Hara Veera Mallu: పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)ప్రకటించిన తేదీ అంటే మార్చి 28న విడుదల అవుతుందా? అన్నది కొంత కాలంగా సందేహంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే  అదే రోజుకు ఫిక్స్ అయిన నితిన్ రాబిన్ హుడ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యాడ్ స్క్వేర్ సినిమాల ప్రొమోషన్స్ వేగంగా జరుగటమే కారణం.

కానీ ఇప్పటి వరకు హరిహర వీరమల్లు టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ పోస్ట్ పోన్ గురించి ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వడం లేదు. ఈ నేపధ్యంలో నిర్మాత నాగ వంశీకు ఈ విషయమై మీడియా వారి నుంచి ప్రశ్న ఎదురైంది. 

23
Will Mad Square clash with Hari Hara Veera Mallu? Here the clarity in telugu


‘హరిహర వీరమల్లు’ అనుకున్న తేదీకే విడుదలైతే.. తాను నిర్మించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (MAD Square) మార్చి 29న రిలీజ్‌ కాదని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ఆ మూవీ ప్రమోషన్స్‌ కోసం శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

‘28న హరిహర వీరమల్లు రిలీజ్‌ కానుంది. 29 మీకు కరెక్ట్‌ డేట్‌’ అనుకుంటున్నారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ప్రొడ్యూసర్‌ స్పందించారు. ‘హరిహర వీరమల్లు 28న వస్తుందో, లేదోనన్న విషయం వేణు గోపాల్‌ గారిని అడగాలి. ఆయన మాకు ఇంకా చెప్పలేదు. ఒకవేళ ఆయన ఆ చిత్రం వస్తుందని చెబితే.. మా సినిమా రాదు’ అని అన్నారు.  

33
Will Mad Square clash with Hari Hara Veera Mallu? Here the clarity in telugu


ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో  కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.  నిజంగానే ‘హరిహర వీరమల్లు’ మూవీ మార్చి 28న రావడం లేదా.. అందుకే నాగవంశీ ఇలాంటి కామెంట్స్ చేశారా.. అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. మరి దీనిపై ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరో ప్రక్క ‘మ్యాడ్’కి సీక్వెల్ మొదలెట్టారు. ఫన్ ఎంటర్టైనర్ గా  గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories