మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. ఇద్దరూ డీప్‌గా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసి తిరుగుతున్నారు.
తమన్నా భాటియా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఆమె నటుడు విజయ్ వర్మతో డేటింగ్ పెళ్లి వరకు వెళ్తుందా? కేవలం డేటింగ్ వరకే పరిమితమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆమె దీనిపై విభిన్నంగా స్పందించింది.
26
ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లిపై తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎలాంటి వాడిని చేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఈ వీడియో షాట్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. ఇందులో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
36
ఇందులో తమన్నా ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి అనేది చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. నీ జీవితంలో ముందు నువ్వు ఒక వ్యక్తిని కనుగొనాలి. అతను వచ్చినప్పుడు నీ లైఫ్‌లో కొత్తగా ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతను తనవెంట ఉంటే బాగుండనే ఫీలింగ్ కలగాలి. అతను నీ లైఫ్‌లోకి వస్తే ఆ జీవితం ఫుల్ ఫిల్‌గా అనిపించాలి. లైఫ్ వాల్యూ పెరిగిన ఫీలింగ్ కలగాలి.
46
అతనితోనే నీకు జీవించాలనే ఫీలింగ్ కలగాలి. ఆయనతో ఉంటే జీవితంలో ఫన్‌గా, బాగుంటుందనే భావన కలగాలి. అతను ఉంటే తన లైఫ్ బాగుంటుందని ఫీల్ కావాలి. అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు, అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని, పెళ్లిపై తన అభిప్రాయం అదే అని మిల్కీ బ్యూటీ చెప్పింది. ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
56
Tamannaah Bhatia and Vijay Varma
మరి విజయ్ వర్మని కలిసినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు తమన్నాకి అలాంటి ఫీలింగే కలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇంతకి తన ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ జంట మాత్రం ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్ అనేలా ఉండటం విశేషం.
66
ఇక తమన్నా ఈ ఏడాది సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మెరిసింది. `జైలర్`తో సంచలన విజయాన్ని అందుకుంది. `భోళాశంకర్`తో డిజాస్టర్‌ని చవిచూసింది. `జీ కర్డా`, `లస్ట్ స్టోరీస్` వంటి బోల్డ్ కంటెంట్ ఓటీటీ చిత్రాలు చేసి విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం తమిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తూ బిజీగా ఉంది.