కే విశ్వనాథ్, జమున, తారకరత్న, చంద్రమోహన్.. 2023లో దివికేగిన టాలీవుడ్ దిగ్గజాలు..

First Published Dec 12, 2023, 5:22 PM IST

టాలీవుడ్ కు 2023 ఎంత విజయాన్ని అందించిందో... ప్రముఖులను తీసుకెళ్లి అంతే బాధనూ మిగిల్చింది. ఈ ఏడాది ప్రారంభం మొదలు కే విశ్వనాథ్, జమున, చంద్రమోహన్ వంటి దిగ్గజాలూ ప్రాణాలొదిలారు. ఈ సంవత్సరం దర్శకులు, నటీనటులు, సింగ్స్, కొరియోగ్రాఫర్లు, మరింత మంది మనకు దూరమయ్యారు. వారిని మరోసారి గుర్తుచేసుకుందాం.
 

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, నటుడు, కళా తపస్వి కే విశ్వనాథ్ (K Viswanath) ను ఈ ఏడాది కోల్పోవడం బాధాకరం. ఫిబ్రవరి 2న హైదరాబాద్ లో ఆయన కన్నుమూశారు. ఆయన 1930 ఫిబ్రవరిలో 19న జన్మించి.. 92వ ఏటా తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా, నటుడిగా వందల సినిమాలకు పనిచేశారు. 

తెలుగు తెర సత్యభామ, ప్రముఖ నటి జమున (Jamuna)  కూడా ఈ ఏడాదే కన్నుమూశారు. 1936లో జన్మించిన దిగ్గజ నటి 2023 జనవరి 27న హైదరాబాద్ లో కన్నుమూశారు. 86వ ఏటా ప్రాణాలు వదిలారు. 

Latest Videos


ప్రసిద్ధ సింగర్ వాణీ జయరామ్ (Vani Jairam) ఈ ఏడాది ప్రారంభంలోనే కన్నుమూశారు. ఫిబ్రవరి 4న ప్రాణాలొదిలారు. సంగీత ప్రియులను, అభిమానులను శోకసంద్రంలో నెట్టారు.

నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna)  కొనఊపిరితో 20 రోజులకు పైగా ఆస్పత్రిలో పోరాడి మృతిచెందారు. ఫిబ్రవరి 18న కన్నుమూశారు. 39వ ఏట అతి చిన్న వయస్సులో కన్నుమూశారు. 

ప్రముఖ స్టంట్ మాస్టర్ జూడో కేకే రత్నం (Judo KK Ratnam)  ఈ ఏడాది జనవరి 26న కన్నుమూశారు. చాలా చిత్రాల్లో బడా హీరోలతో స్టంట్స్ కొట్టించారు. 

సీనియర్ హీరో, టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan)   ఈ ఏడాది నవంబర్ 11న మృతి చెందారు. ఆయన మరణంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

200కు పైగా తమిళ, తెలుగు చిత్రాలతో అలరించిన  శరత్ బాబు (Sarath Babu)  ఈ ఏడాది మే 27న కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలో మరణించారు.

తెలుగు, తమిళం హీరోలకు తనగాత్రం అందించిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి (Srinivasa Murthy)ని కూడా టాలీవుడ్ కోల్పోయింది. ఈయన జనవరి 27న మృతిచెందారు. 

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు విద్యాసాగర్ రెడ్డి (Vidyasagar Reddy)  ఫిబ్రవరి 2న మరణించారు. ఈయన డైరెక్షన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘రాకాసి లోయ’. దీంతో ఆయన్ని సాగర్ రాకసి అని కూడా పిలుస్తుంటారు. 

కోలీవుడ్ హాస్య నటుడు మయిల్ స్వామి (Mayilsamy) కూడా గుండెపోటుతో మరణించారు. ఫిబ్రవరి 19న ఆయన తుదిశ్వాస విడిచారు. 

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ (Sudheer Varma)  జనవరి 23న ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న వయస్సులోనే సూసైడ్ చేసుకోవడం బాధాకరం. ఈయన ‘కుందనపు బొమ్మ’ అనే చిత్రంలో హీరోగా నటించారు. 

ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య (Choreographer Chaitanya)  కూడా ఆత్మహత్య చేసుకోవడం ఆ మధ్యలో సంచనలంగా మారింది. మే 1న మాస్టర్ సూసైడ్ చేసుకున్నారు.  

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh Master) వడదెబ్బకు గురై పరిస్థితి విషమించి మరణించారు. జూన్ 18 మాస్టర్ కన్నుమూశారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, తదితరులు ఆయన శిష్యులు కావడం విశేషం. 

కోలీవుడ్ సీనియర్ హాస్య నటుడు మనోబాల (Manobala) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ ఏడాది మే 3న 69వ ఏటా తుదిశ్వాస విడిచారు. 

click me!