ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త ప్రశ్నలు మొదలవుతున్నాయి. పెళ్లెప్పుడనే ప్రశ్న మొదలైంది. ప్రేమ విషయంలో క్లారిటీ రావడంతో, ఇటీవల హీరోయిన్లంతా పెళ్ళిళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో తమన్నా కి ఈ ప్రశ్న ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తమన్నా దీనిపై స్పందించింది. పెళ్లనేది పార్టీ చేసుకోవడం కాదని, అది అంత ఈజీ కాదని చెప్పింది. పెళ్లి మనకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే దాని గురించి ఆలోచించాలని తెలిపింది. పెళ్లంటే అదేదో పార్టీ చేసుకోవడం కాదని, అదొక పెద్ద బాధ్యత అని, ఆ బాధ్యతని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని తెలిపింది. అంతేకానీ, పెళ్లీడు వచ్చిందనో, ఎవరో అంటున్నారనో పెళ్లి చేసుకోకూడదని స్పష్టం చేసిందీ మిల్కీ బ్యూటీ.