Adipurush : ‘రామ జయం రఘురామ జయం’.. టపాసులు పేల్చి ‘ఆదిపురుష్’ మేకర్స్ సెలబ్రేషన్స్...

First Published | Jun 16, 2023, 7:50 PM IST

గ్రాండ్ విజువల్స్ తో ఈరోజు థియేటర్లలోకి వచ్చిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ ఆడియెన్స్  నుంచి మంచి విజయాన్నే దక్కించుకుంది. ఈ సందర్భంగా మేకర్స్  సంతోషం వ్యక్తం చేస్తూ యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేశారు. 
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  సీతారాములుగా ప్రేక్షకులను అలరించారు. తమ నటనతో మెప్పించారని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
 

తొలిరోజు టాక్ బాగానే ఉంది. కొందరు తమకు నచ్చని అంశాలనూ వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు మాత్రం చిత్రాన్ని విజయవంతం చేశారు. చిత్రం 3డీ వెర్షన్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో మొత్తం ఇవ్వాళ Adipurush హవానే నడిచింది. 


ఇప్పటికే అభిమానులు ‘ఆదిపురుష్’ బ్లాక్ బాస్టర్ అంటూ థియేటర్ల వద్ద సంబురాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ కూడా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు పేల్చి  సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

‘ఆదిపురుష్’ చిత్రాన్ని టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. తెలుగు రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల్లో కాస్తా మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్యూ చెబుతూ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అలాగే ‘రామ జయం రఘురామ జయం’ అంటూ టపాసులు పేల్చి  సెలబ్రేట్ చేశారు. ఇక ముందెన్నడు లేని విధంగా ‘ఆదిపురుష్’  ఎర్లీ షోస్ కు రెస్పాన్స్ దక్కిందని టీమ్ తెలిపింది. భారీ స్థాయిలో చిత్రం విడుదల కావడంతో సినిమా తొలిరోజు కలెక్షన్లు ఏమేరకు వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది. 
 

Latest Videos

click me!