ట్రాన్స్ ఫరెంట్ చున్నీలో ప్రియా వారియర్ టాప్ షో.. ట్రెడిషనల్ వేర్ లో యంగ్ బ్యూటీ అదిరిపోయే లుక్.. పిక్స్

First Published | Jun 16, 2023, 8:41 PM IST

మలయాళీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.లేటెస్ట్ గా ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చి కట్టిపడేసింది. 
 

కన్ను గీటు వీడియోతో ప్రియా ప్రకాష్ వారియర్ దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది. అప్పటి వరకు మలయాళంలోనే సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు తమిళం, తెలుగులోనూ ఆఫర్లు అందాయి. 
 

తెలుగులో ప్రియా వారియర్ రెండు చిత్రాల్లో నటించింది.  ముందు నితిన్ సరసన ‘చెక్’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ సరసన ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు ప్రియాకు సక్సెస్ ను అందించలేకపోయాయి. 
 


దీంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకోవాలంటే సాలిడ్ హిట్ కావాల్సిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ గానే కాకుండా కీలక పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. 
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. వరుసగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అందంతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లూ లెహంగా, వోణీలో మెరిసింది. యువరాణిలా ఫోజులిస్తూ నెటిజన్లు కట్టిపడేసింది. ట్రెడిషనల్ వేర్ లో మెరిసిపోయింది.  అలాగే ట్రాన్స్ ఫరెంట్ వోణీలో ఎద అందాలను విందు చేస్తూ గ్లామర్ షో చేసింది. మత్తు చూపులు, మత్తెక్కించే ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

ఇదిలా ఉంటే.. ప్రియా ప్రకాష్ త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ తో అలరించబోతోంది. అదేంటో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’తోనే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తై ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. వచ్చే నెల 28న విడుదల కానుంది. 
 

Latest Videos

click me!