తమన్నాపై డైరెక్టర్ అభిమానం, ఏకంగా రూ.4 కోట్లు ఇచ్చేస్తున్నారు.. త్రిష, శృతిహాసన్, కాజల్ కి దిమ్మతిరిగే షాక్

First Published | Dec 13, 2024, 7:37 AM IST

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా తమన్నా క్రేజ్ తగ్గడం లేదు. హీరోయిన్ గా ప్రస్తుతం తమన్నా ఎక్కువ సినిమాలు చేయడం లేదు. కానీ ఆమె గ్లామర్ క్రేజ్ ని ఉపయోగించుకుంటూ ఐటెం సాంగ్స్ చేస్తోంది. 

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా తమన్నా క్రేజ్ తగ్గడం లేదు. హీరోయిన్ గా ప్రస్తుతం తమన్నా ఎక్కువ సినిమాలు చేయడం లేదు. కానీ ఆమె గ్లామర్ క్రేజ్ ని ఉపయోగించుకుంటూ ఐటెం సాంగ్స్ చేస్తోంది. తమన్నా ఐటెం నంబర్ చేస్తే చాలు.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. జైలర్, స్త్రీ 2 లాంటి చిత్రాల్లో తమన్నా క్రేజీగా ఐటెం సాంగ్స్ చేసింది. అవి సూపర్ హిట్ అయ్యాయి. 

ఐటెం సాంగ్ కి సైతం తమన్నా కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటోంది. మిల్కీ బ్యూటీకి ఉన్న డిమాండ్ అది. ఇక తమన్నా అప్పుడప్పుడూ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా తమన్నా ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు తప్ప లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది చాలా తక్కువ. తొలిసారి తమన్నా లేడీ ఓరియెంటెడ్ కథలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. 

Tap to resize

ఫస్ట్ పార్ట్ ఓదెల రైల్వే స్టేషన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించింది. ఓదెల 2లో తమన్నా సన్యాసి పాత్రలో నటిస్తోంది. సాధారణంగా తమన్నా గ్లామర్ ఒలకబోస్తే కోట్లల్లో రెమ్యునరేషన్ ఇస్తారు. కానీ ఓదెల 2లో ఆమె సన్యాసిగా నటిస్తున్నారు. అయినప్పటికీ తమన్నా కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈ చిత్రానికి అందుకుంటోంది. 

sampath nandi

ఆమె పూర్తిగా సన్యాసిగా కనిపిస్తుందా లేక గ్లామర్ అంశాలు కూడా ఉన్నాయా అనేది ఇప్పుడే తెలియదు. ఎందుకంటే మొదటి భాగంలో హెబ్బా పటేల్ రెచ్చిపోయి గ్లామర్ సీన్స్ లో నటించింది. మరి తమన్నా కూడా గ్లామర్ ఒలకబోసిందేమో చూడాలి. ఓదెల 2కి తమన్నాని బాగా అభిమానించే దర్శకుడు సంపత్ నంది కథ అందిస్తున్నారు. అశోక్ తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Tamannaah Bhatia

తమన్నాపై అభిమానంతోనే సంపత్ నంది ఈ కథ రాసినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ముట్టేలా ప్రొడ్యూసర్స్ ని ఒప్పించినట్లు కూడా టాక్. తమన్నా సాధారణంగా 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. కానీ ఈ చిత్రానికి ఏకంగా 4 కోట్లు ఇస్తున్నారట. టాలీవుడ్ వర్గాలు తమన్నా రెమ్యునరేషన్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. 30 ప్లస్ లో ఉన్న సౌత్ హీరోయిన్లలో తమన్నా హైయెస్ట్ పైడ్ నటిగా అవతరించింది. త్రిష, శృతి హాసన్, కాజల్ లాంటి హీరోయిన్లు 3 కోట్ల లోపే పారితోషకం తీసుకుంటారు. వారందరికీ మిల్కీ బ్యూటీ చెక్ పెట్టేసింది. 

Latest Videos

click me!