పాన్ ఇండియా స్టార్ వల్ల 10 ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్.. ఏకంగా 120 కోట్ల ఆస్తి ఉన్న ఆమె ఎవరంటే

Published : Sep 25, 2025, 07:43 PM IST

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రోత్సాహంతో వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తున్నట్లు ఓ నటి ప్రకటించారు. ఆమె ఆస్తి ఎంత ? ఒక్కో ఐటెం సాంగ్ కి ఎంత రెమ్యునరేషన్ అందుకుంటోంది లాంటి వివరాలు ఈ కథనంలో చూద్దాం. 

PREV
15
ఐటెం సాంగ్స్ తో పాన్ ఇండియా క్రేజ్ 

స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చాక ఐటమ్ సాంగ్స్ చేసే నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. క్రేజ్ ఉన్న హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేస్తారు. కానీ వాళ్ళు చేసే ఐటెం సాంగ్స్ పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఒక్క హీరోయిన్ మాత్రం ఐటెం సాంగ్స్ విషయంలో తనకి హద్దులు లేవని చెప్పేస్తోంది. హీరోయిన్ గా సౌత్ లో ఎంతటి స్టార్ డమ్ సొంతం చేసుకుందో.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఐటమ్ సాంగ్స్ తో అంతకు మించిన పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా.

25
అగ్ర హీరోలతో నటించిన మిల్కీ బ్యూటీ

హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు పొందిన తమన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత తమన్నాకి అగ్ర హీరోలతో నటించే అవకాశాలు దక్కాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, నాగచైతన్య, పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సరసన తమన్నా సినిమాలు చేసింది. గ్లామర్ తో తమన్నాకి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఐటెం సాంగ్స్ లో నటించే సాహసం ఎవరూ చేయరు.

35
అల్లు అర్జున్ వల్లే వరుసగా ఐటెం సాంగ్స్ 

కానీ తమన్నా అప్పట్లోనే ఐటెం సాంగ్స్ చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా అల్లు అర్జున్ బద్రీనాథ్ చిత్రంలో నటించిన తర్వాత తనకి ఐటెం సాంగ్స్ విషయంలో కాన్ఫిడెన్స్ పెరిగింది అని తమన్నా రీసెంట్ గా ఇంటర్వ్యూలో పేర్కొంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోకి సమానంగా డాన్స్ చేసే అవకాశం హీరోయిన్ లకి ఉండదు. కానీ బద్రీనాథ్ మూవీలో అల్లు అర్జున్ తనతో పాటు డాన్స్ చేసే అవకాశాన్ని కల్పించి ప్రోత్సాహించారు. ఆ మూవీతో తాను కూడా డాన్స్ చేయగలనే కాన్ఫిడెన్స్ పెరిగినట్లు తమన్నా పేర్కొంది.

అందుకే ఐటెం సాంగ్స్ లో కూడా బాగా పెర్ఫార్మ్ చేయగలనని నమ్మకంతో వాటికి అంగీకరిస్తున్నట్లు తమన్నా తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లో తనకి వస్తున్న అవకాశాలన్నీ అల్లు అర్జున్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అని తమన్నా పేర్కొంది. తమన్నా తన కెరీర్లో స్పీడున్నోడు, జై లవకుశ, కే జి ఎఫ్, సరిలేరు నీకెవ్వరు, గని, రైట్ 2, స్త్రీ, రీసెంట్ గా వచ్చిన బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇలా ఏకంగా 10 ఐటెం సాంగ్స్ లో తమన్నా నటించింది  

45
5 నిమిషాలకు కోటి రెమ్యునరేషన్ 

ప్రస్తుతం తమన్నా సంపాదన హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తమన్నా ఒక్కో ఐటమ్ సాంగ్ కి కోటి రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటమ్ సాంగ్ మహా అయితే ఐదు నిమిషాలు ఉంటుంది. ఐదు నిమిషాలకి కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు. కొందరు స్టార్ హీరోయిన్లు సినిమా మొత్తం నటించిన అంత రెమ్యునరేషన్ అందుకోవడం కష్టం. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ క్వీన్ గా మారిపోయింది. తమన్నా చేసిన ఐటెం సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. రైడ్ 2 లో తమన్నా చేసిన నషా నషా అనే సాంగ్ 114 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. 

55
తమన్నా ఆస్తి 120 కోట్లు 

ఐటెం సాంగ్స్ తోనే కోట్లల్లో సంపాదిస్తున్న తమన్నా ఆస్తి విలువ 120కోట్ల వరకు ఉంటుందని అంచనా. తమన్నా వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. లవ్ ఎఫైర్ లాంటివి ఆమె జీవితంలో ఉన్నాయి కానీ పెళ్లి వరకు వెళ్ళలేదు. రీసెంట్ గా తమన్నా నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకుంది. తమన్నా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. రీసెంట్ గా డు యు వన్నా పార్ట్నర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. తమన్నా తన కెరీర్ లో రచ్చ, హ్యాపీడేస్, బాహుబలి, జైలర్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించింది. 

Read more Photos on
click me!

Recommended Stories