40 వేల పాటలు, 6 జాతీయ అవార్డులు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికార్డుల రారాజు

Published : Sep 25, 2025, 06:28 PM IST

S P Balasubrahmanyam : గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  ఈ లోకాన్ని  విడిచి 5 ఏళ్లు పూర్తయ్యాయి.   సినీ పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలు, రికార్డులు అన్నీ ఇన్నీ కావు. 

PREV
15
సంగీత ప్రపంచంలో సాటిలేని గాయకుడు

భారతీయ సంగీత ప్రపంచంలో సాటిలేని నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  కన్నుమూసి ఐదేళ్లు గడిచాయి. ఆయన మరణించినా.. పాటల ద్వారా ఎస్పీబీ నేటికీ జీవించే ఉన్నారు. అభిమానులు  ముద్దుగా ఎస్పీబీ అని పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం . తన పాటలతో దేశ, భాషా సరిహద్దులు దాటి అందరి బాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

25
40,000కు పైగా పాటలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లుూరులో పుట్టిపెరగిన బాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తో పాటు దాదాపు 10 కి పైగా భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు.  ఏ పాటైనా, ఏ భాషయైనా, సులువుగా పాడే గాయకుడు. నలభై ఏళ్లలో  ఆరుసార్లు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు. వివిధ రాష్ట్రాల నుంచి లెక్కలేనన్ని అవార్డులు బాలు సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. అత్యధిక పాటలు పాడి రికార్డు సృష్టించిన నేపథ్య గాయకుడిగానూ ఎస్పీబీకి గుర్తింపు ఉంది.

35
బహుముఖ ప్రజ్ఞాశాలి

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, అస్సామీ, ఒరియా, బెంగాలీ, హిందీ, సంస్కృతం, తుళు, మరాఠీ, పంజాబీ ఇలా ఎస్పీబీ గొంతు తాకని భాష లేదు, మనిషి లేడు. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నింటికీ మించి, ఏమాత్రం గర్వం లేని గొప్ప మనిషి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

45
మంచి మనసున్న బాలు

ఎస్పీబీ ఎందరో యువకులకు సహాయం చేశారు. ముఖ్యంగా 1983లో భారత చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌కు స్పాన్సర్ చేశారు. చెప్పాలంటే, ఆనంద్ కెరీర్‌కు ఎస్పీబీ చేసిన సహాయం ఎంతో ఉపయోగపడింది. అలాగే నటుడు అజిత్‌ను 'ప్రేమ పుస్తకం' అనే సినిమాలో హీరోగా సిఫార్సు చేసింది కూడా ఎస్పీబీనే. అంతే కాదు ఈరోజు ఇళయరాజా ఇంత గొప్ప సంగీత దర్శకుడు అయ్యాడంటే ఎస్పీబీ చేసిన సహాయం వల్లే. బాలు పరిచయం చేయబట్టే ఇళయరాజా అవకాశాలు వచ్చాయని చాలాసందర్భాల్లో ఆయన వెల్లడించారు.  ఇలా ఆయన చేసిన సాయాలు ఎన్నో.

55
బాలు ఖాతాలో రికార్డులెన్నో

1981లో 12 గంటల్లో 21 కన్నడ పాటలు పాడి రికార్డు సృష్టించారు. తర్వాత ఒకే రోజులో 19 తమిళ పాటలు, మరోసారి 16 హిందీ పాటలు పాడారు. ఇలాంటి ఘనత మళ్ళీ ఎవరు సాధించగలరు? ప్రేమించడానికి, డ్యాన్స్ చేయడానికి, జోల పాడటానికి, మేల్కొలపడానికి ఎస్పీబీ గొంతు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో  వెన్నెల కురిసినట్లు, మనసు తాకుతూనే ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories