తమన్నా గుట్టురట్టు, నాని విలన్ తో లవ్ ఎఫైర్.. ప్రియుడిని ముద్దుల్లో ముంచెత్తిన మిల్కీ బ్యూటీ ?

First Published Jan 2, 2023, 4:29 PM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ ఇతర హీరోయిన్లకు దక్కలేదు.

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ ఇతర హీరోయిన్లకు దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

హీరోయిన్ల లవ్ అఫైర్స్ గురించి అనేక వార్తలు వస్తుంటాయి. కానీ తమన్నా ఇంతవరకు ప్రేమ, పెళ్లి జోలికి వెళ్ళలేదు. పెళ్లి గురించి ప్రశ్నిస్తే దాటవేస్తూ వచ్చింది. ప్రస్తుతం తమన్నా వయసు 33 ఏళ్ళు. కొత్తసంవత్సరం 2023లో తమన్నా పెళ్లి చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా తమన్నా ప్రేమ వ్యవహారం బయటపడ్డట్లు తెలుస్తోంది. 

తమన్నా ప్రేమ వ్యవహారం బయటకి రావడంతో సోషల్ మీడియాలో మోతెక్కుతోంది. తమన్నా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని గోవాలో జరుపుకుంది. న్యూ ఇయర్ పార్టీలో తమన్నా రెడ్ డ్రెస్ లో మెరిసింది. అంతా పార్టీ మూడ్ లో ఉండగా తమన్నా ఓ వ్యక్తిని కౌగలించుకుని ముద్దు పెట్టుకోవడం వైరల్ గా మారింది. దీనితో ఆ వ్యక్తి ఎవరు అంటూ ఆరా తీయడం ప్రారంభించారు. 

తమన్నా ముద్దు పెట్టుకున్నది ఎవరినో కాలేదు నటుడు విజయ్ వర్మని. వీళ్ళిద్దరూ ఘాటైన ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారట. విజయ్ వర్మ పలు హిందీ చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో కూడా విజయ్ వర్మ నటించారు. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ విజయ్ వర్మనే కావడం విశేషం. 

ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తమన్నా తన లవ్ అఫైర్ మ్యాటర్ ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. ఏది ఏమైనా తమన్నా ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో తుఫాన్ గా మారింది. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

click me!