Suman : సుమన్ ఓ కేసులో చిక్కుకోవడం వాళ్ళ కెరీర్ లో వెనుకబడిపోయారు. సుమన్ కష్టాల్లో ఉన్నప్పటికీ ఫ్రెండ్ షిప్ కి విలువ ఇచ్చిన వ్యక్తి అని ఓ క్రేజీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ నటుడు సుమన్ కెరీర్ లో ఓ వివాదంలో చిక్కుకుని జైలు పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమన్ తన కెరీర్ లో వెనుకబడిపోయారు. సుమన్ కి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో భాను చందర్ ఒకరు. భాను చందర్ 80, 90 దశకాలలో హీరోగా రాణించిన సంగతి తెలిసిందే. సుమన్ తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి పరోక్షంగా కారణం భాను చందర్ అనే చెప్పాలి.
25
రాంగ్ స్టెప్ వేస్తున్నావు అని సుమన్ కి చెప్పా
భాను చందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుమన్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అప్పట్లో సుమన్ తెలుగు సినిమాలు చేసేవాడు కాదు అని భానుచందర్ అన్నారు. నేను సుమన్ తో ఒకరోజు ఇలా అన్నాను. సుమన్ నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అని చెప్పా. ఏమైంది అని అడిగారు. నువ్వు తమిళ ఇండస్ట్రీకి పనికిరావు రా.. తెలుగు ఇండస్ట్రీకి వస్తే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అని చెప్పా. నువ్వు తెలుగు ఇండస్ట్రీకి వచ్చేయ్ అని చెప్పా. సుమన్ వెంటనే అయ్యో నేను రాను.. నాకు తెలుగు భాష ఒక్క ముక్క రాదు అని చెప్పాడు.
35
తెలుగులో సుమన్ తొలి చిత్రం
భాష గురించి నువ్వు దిగులు పడకు.. మూడు నెలల్లో నేర్చేసుకోవచ్చు అని చెప్పా. వెంటనే సుమన్ ని తీసుకుని వెళ్లి తమ్మారెడ్డి భరద్వాజ గారికి పరిచయం చేశాను. మేమిద్దరం కరాటేలో బ్లాక్ బెల్ట్స్. మమ్మల్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తే బావుంటుంది అని తమ్మారెడ్డితో అన్నాను. ఆయన ఏంటి భాను ఎవరో ఎర్ర తోలు వాడిని నాకు పరిచయం చేస్తున్నావు అని అన్నారు. రెండు రోజుల తర్వాత ఆయనే వచ్చి భాను.. మీ ఇద్దరితో సినిమా చేస్తున్నాను కథ రెడీగా ఉంది. రేపటి నుంచే షూటింగ్ అని అన్నారు. ఆ చిత్రమే ఇద్దరు కిలాడీలు అని భాను చందర్ తెలిపారు.
భాష విషయంలో సుమన్ బిగినింగ్ లో ఇబ్బంది పడ్డారు. నేను, తమ్మారెడ్డి గారు ఎంకరేజ్ చేశాం. దీనితో తక్కువ సమయంలోనే సుమన్ తెలుగులో క్రేజీ హీరోగా మారిపోయారు. మా ఇద్దరి ఫ్రెండ్ షిప్ కూడా బాగా బలపడిపోయింది. కానీ ఒక రోజు సడెన్ గా సుమన్ కారులో నా దగ్గరికి వచ్చి రేయ్ భాను.. రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయవద్దు, మాట్లాడవద్దు అని చెప్పాడు. ఏం జరిగిందిరా నీకేమైనా మెంటలా అని అడిగా.
55
నిజమైన ఫ్రెండ్ అంటే సుమనే
ఒక వివాదంలో పోలీసులు నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. నాతో పరిచయం ఉన్న వారందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నువ్వు నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను కూడా క్వశ్చన్ చేస్తారు. నా వల్ల నువ్వు కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. రేపు నా పరిస్థితి ఏంటో తెలియదు.. నేను ఇంట్లో ఉంటానా.. జైల్లో ఉంటానా అనేది కూడా తెలియదు. కాబట్టి నాకు దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు పేపర్ చూస్తే సుమన్ జైల్లో ఉన్నారని న్యూస్ కనిపించింది. సుమన్ ప్లేస్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే నాతో పాటు భాను చందర్ కూడా ఇరుక్కోవాలి అని కోరుకునేవారు. కానీ సుమన్ రియల్ ఫ్రెండ్. తన వల్ల తాన్ ఫ్రెండ్ ఇబ్బందులు పడకూడదు అని ఆలోచించాడు. అది సుమన్ వ్యక్తిత్వం అంటూ భాను చందర్ ప్రశంసలు కురిపించారు.