జీవితంలో ఐటెం సాంగ్స్ జోలికి వెళ్ళను, ఆ మూవీ తర్వాత భయంతో తమన్నా కామెంట్స్..ఏం జరిగిందంటే

First Published | Sep 5, 2024, 11:46 AM IST

స్టార్ హీరోయిన్ హోదా ఉండి కూడా తమన్నా చేసినన్ని ఐటెం సాంగ్స్ ఇంకెవరూ చేయలేదు. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేయడానికి వెనకడుగు వేస్తారు. కానీ తమన్నా తాను ఎప్పుడూ సిద్దమే అంటూ ముందుకు వస్తుంది.

స్టార్ హీరోయిన్ హోదా ఉండి కూడా తమన్నా చేసినన్ని ఐటెం సాంగ్స్ ఇంకెవరూ చేయలేదు. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేయడానికి వెనకడుగు వేస్తారు. కానీ తమన్నా తాను ఎప్పుడూ సిద్దమే అంటూ ముందుకు వస్తుంది. చాలా చిత్రాల్లో తమన్నా ఇప్పటి వరకు ఐటెం సాంగ్స్ చేసింది. వాటిలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయి. 

కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో కూడా మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అల్లుడు శ్రీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అదే అదే విధంగా ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ, వరుణ్ తేజ్ గని, జైలర్ చిత్రంలో చిన్న పాత్రతో కూడిన స్పెషల్ సాంగ్ చేసింది. 


రీసెంట్ గా తమన్నా..రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం స్త్రీ 2లో స్పెషల్ సాంగ్ చేసింది. అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూలో తమన్నా ఐటెం సాంగ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ జై లవకుశ చిత్రంలో స్వింగ్ జరా, జైలర్ చిత్రంలో కావాలయ్యా సాంగ్స్ లో తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

అలాంటి డ్యాన్స్ మూమెంట్స్ హాట్ గా చేయడం తమన్నాకి మాత్రమే సాధ్యం అంటూ ప్రశంసలు దక్కాయి. అయితే ఒక చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన తర్వాత తాను ఇక జీవితంలో ఇక ఐటెం సాంగ్ జోలికి వెళ్ళకూడదు అని తమన్నా భావించింది అట. ఆ చిత్రం మరేదో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్. 

జైలర్ చిత్రంలో కావాలయ్యా సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. కొన్ని లక్షల మంది ఆ సాంగ్ కి రీల్స్ చేశారు. వరల్డ్ వైడ్ గా ఆ పాట ట్రెండ్ అయింది. ఎక్కడ చూసినా అందులో స్టెప్పుల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సాంగ్ ని మ్యాచ్ చేసేలా మరో ఐటెం సాంగ్ చేయలేం. కంపారిజాన్ చేసి తిడతారు అని భయం వేసింది. అందుకే ఐటెం సాంగ్స్ ఇక చేయకూడదు అనుకున్నా. 

కానీ వెంటనే స్త్రీ 2లో అవకాశం వచ్చింది. అయితే నేను ముందుగా అంగీకరించలేదు. డైరెక్టర్ అమర్ కౌశిక్ నన్ను కన్విన్స్ చేశారు. ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అవుతుందని తెలిపారు. ఆ నమ్మకంతోనే స్పెషల్ సాంగ్ చేసినట్లు తమన్నా పేర్కొంది. ఆజ్ కి రాత్ అనే స్పెషల్ సాంగ్ స్త్రీ 2 చిత్రానికి మంచి హైప్ ఇచేలా హిట్ అయింది. 

Latest Videos

click me!