వినాయకుడు కూడా అవాక్కు అవుతాడు... అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంట్రా బాబు!

First Published | Sep 5, 2024, 10:15 AM IST

  పుష్ప 2 మూవీలోని 'సూసేకి అగ్గిమాదిరి'' సాంగ్ లోని అల్లు అర్జున్, రష్మిక మందాన గెటప్స్ తో కూడిన వినాయక విగ్రహం తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

Ganesh Chaturthi 2024


గణేష్ చతుర్థి వచ్చిందంటే స్టార్ హీరోల ఫ్యాన్స్ మెదళ్లలో వింత ఆలోచనలు పురుడు పోసుకుంటాయి. తమ హీరోల లేటెస్ట్ మూవీస్ లేదా బ్లాక్ బస్టర్ చిత్రాల్లోని లుక్స్, గెటప్స్ లో విగ్రహాలు తయారు చేయిస్తారు. గబ్బర్ సింగ్, బాహుబలి, జనతా గ్యారేజ్, పుష్ప, శ్రీమంతుడు  చిత్రాల్లోని ఆయా హీరోలతో రూపొందిన గణేష్ విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Ganesh Chaturthi 2024

ఇది ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే అంశం. దేవుళ్లను హీరోలతో పోల్చడం. హీరోల ప్రతిరూపాలతో దేవుడి విగ్రహాలు, ఫోటోలు మలచడం అంగీకరించరాని విషయం. వినాయక చవితి నిమజ్జనం వేళ చిత్ర విచిత్రమైన రూపాల్లో గణేశుడు కనిపిస్తాడు. వినాయక చవితికి ప్రతి వీధిలో విగ్రహాలు వెలుస్తాయి. 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో గణేషుడిని పూజించి నిమ్మజ్జనం చేస్తారు. 


గణేష్ చతుర్థి యూత్ కి ఇష్టమైన పండగ. మండపం నిర్మించి, వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తారు. దీనికి అవసరమైన ఖర్చుల కోసం తమ ఏరియాలో చందాలు వసూలు చేస్తారు. ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహించి ప్రసాదాలు వడ్డిస్తారు. గణేష్ మండపం వద్ద కమిటీ కుర్రాళ్ళు అందరూ చేరి ముచ్చట్లు పెడతారు. 

ప్రతి విషయంలో మిగతా వాళ్ళ కంటే గొప్పగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని పోటీపడతారు. అందుకే వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందిస్తారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి జనాలు అవాక్కు అయ్యారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన హీరోయిన్ రష్మిక మందానను కూడా వినాయకుడు విగ్రహ రూపంలో జోడించారు. 

Ganesh Chaturthi 2024

పుష్ప 2 మూవీలోని 'సూసేకి అగ్గిమాదిరి'' సాంగ్ లోని అల్లు అర్జున్, రష్మిక మందాన గెటప్స్ తో కూడిన వినాయక విగ్రహం తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ గెటప్ కి తోడు రష్మిక మందానను కూడా జోడించడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విగ్రహం చూస్తే వినాయకుడు కూడా షాక్ అవుతాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మరోవైపు పుష్ప 2 విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 షూటింగ్ పూర్తి కాని కారణంగా ఆలస్యమైంది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. 

Pic Credit: Janam News 

2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ పుష్పకు కొనసాగింపుగా పుషప్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్  తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

పుష్ప 2కి ఉన్న డిమాండ్ రీత్యా పెద్ద మొత్తంలో బిజినెస్ జరుగుతుంది. పుష్ప 2 డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ రూ. 270 కోట్లు చెల్లించి దక్కించుకుందట. హిందీ పుష్ప 2 రైట్స్ రూ. 200 కోట్లకు అమ్ముడుపోయాయట. థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఇతర హక్కులు కలుపుకుని పుష్ప రూ. 1000 కోట్ల బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 

మెగా హీరోలతో అల్లు అర్జున్ కి కోల్డ్ వార్ కొనసాగుతుండగా పుష్ప 2 సక్సెస్ అల్లు అర్జున్ కి కీలకంగా మారింది. మరి పుష్ప 2తో అల్లు అర్జున్ ఏ స్థాయి విజయం సాధిస్తాడో చూడాలి.. 
 

Latest Videos

click me!