గుడిలో గంటలు మోగితే నేనే తన మొగుడని ఫిక్సయింది, నా సినిమాలు ఫ్లాప్ కావాలని కోరుకుంది..విక్రమ్ వ్యాఖ్యలు

First Published | Sep 5, 2024, 10:36 AM IST

విక్రమ్ సతీమణి శైలజా బాలకృష్ణన్ మీడియాకి కనిపించింది చాలా తక్కువ. గతంలో ఆమె కుటుంబ విషయాలకు మాత్రమే పరిమితం అయ్యేదట. రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో విక్రమ్ తన సతీమణి గురించి.. ఆమెతో మొదటి పరిచయం గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.

చియాన్ విక్రమ్ విలక్షణ నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నాడు. శివ పుత్రుడు, అపరిచితుడు లాంటి చిత్రాలు విక్రమ్ క్రేజ్ ని తెలుగులో పెంచాయి. ఇటీవల పొన్నియన్ సెల్వన్ చిత్రంలో అదరగొట్టారు. రీసెంట్ గా వచ్చిన తంగలాన్ చిత్రం కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విక్రమ్ ఫ్యామిలీ గురించి ఎవరికీ అంతగా తెలియదు. తన కొడుకు ధృవ్ ని మాత్రం విక్రమ్ హీరోగా నిలబెట్టే పనిలో ఉన్నారు. 

అయితే విక్రమ్ సతీమణి శైలజా బాలకృష్ణన్ మీడియాకి కనిపించింది చాలా తక్కువ. గతంలో ఆమె కుటుంబ విషయాలకు మాత్రమే పరిమితం అయ్యేదట. రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో విక్రమ్ తన సతీమణి గురించి.. ఆమెతో మొదటి పరిచయం గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. విక్రమ్ అసలు పేరు కెనడీ జాన్ విక్టర్. నటుడిగా మారాక స్క్రీన్ నేమ్ కోసం విక్రమ్ అని మార్చుకున్నారు. 


సినిమాల్లోకి రాకముందే తన భార్యతో విక్రమ్ కి పరిచయం ఏర్పడింది. కనీసం అమ్మాయితో మాట్లాడితే తప్పని భావించే రోజులు అవి. కులాలు, మతాల ప్రస్తావన ఇబ్బందులు కూడా ఉండేవి. అయినప్పటికీ ఆమెని కలసినందుకు నేను చాలా సంతోషించాను. మొదట్లో ఆమెని కలసినప్పుడు సినిమా తన రెండవ ప్రేమ మాత్రమే అని చెప్పాను. కానీ క్రమంగా అది నా మొదటి ప్రేమగా మారింది. 

actor vikram

తనకి సినిమాలు ఇష్టం లేదు. నన్ను మొదట తానే చూసిందట. మొదటిసారి చూసినప్పుడే గుడిలో గంటలు మోగినట్లు అనిపించింది అని.. తానే తన మొగుడు అని ఫిక్స్ అయినట్లు ఆ తర్వాత నాకు చెప్పింది. ఇప్పట్లో లివ్ ఇన్ రిలేషన్ ఉంది. కానీ అప్పట్లో అది తెలియదు. కలిసి మాట్లాడడానికే చాలా ఇబ్బందులు ఉండేవి. నాకు సినిమాలపై ప్రాధాన్యత పెరిగే సమయంలో శైలజ ఈ విధంగా కోరుకుంది. 

నా సినిమాలు ఫ్లాప్ కావాలని తాను బలంగా ఆశించింది. నాతో గడిపేందుకు సమయం దొరకాలని శైలజ అలా కోరుకుంది. కానీ ఇప్పుడు ఆమె అభిప్రాయం మారింది. నా సినిమా వ్యవహారాలన్నీ శైలజ చూసుకుంటుంది అని విక్రమ్ తెలిపారు. మొదట్లో నేను నటుడిని కావడానికి ఆమె సహకరించలేదు. ఇప్పుడు ఒక స్నేహితురాలిలా అన్నీ తానే చూసుకుంటుంది అని విక్రమ్ తెలిపారు. 

ఇప్పుడు విక్రమ్ తన భార్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. తంగలాన్ విక్రమ్ కోసం విక్రమ్ ఎంతో కష్టపడ్డారు. విచిత్రమైన గెటప్ లో కనిపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. 

Latest Videos

click me!