అప్పుల్లో స్టార్ హీరోయిన్..? ఇల్లు కూడా తాకట్టు పెట్టిన బ్యూటీ.. కోట్ల ఆస్తులు ఏమైనట్టు..?

First Published | Jul 5, 2024, 4:10 PM IST

ఈమధ్య హీరోయిన్లు చాలా తెలివిగా ఉంటున్నారు. సినిమాలు చేస్తూనే బిజినెస్ లలో కూడా చేయి చేస్తున్నారు. బ్యాగు నిండా సంపాదిస్తున్నారు. ఇలానే సంపాదించిన ఓ స్టార్ హీరోయిన్ ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేస్తుందట. ఇల్లు కూడా తాకట్టు పెట్టిందట. కారణం ఏంటి..?

ఈ కాలంలో హీరోయిన్లు పాటించే ఫార్ములా ఒకటి ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ ఫార్ములాని ప్రతీ ఒక్క హీరోయిన్ పాటిస్తున్నారు. ఎందుకుంటే హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ. కాస్త వయస్సు అయిపోగానే పక్కకి తప్పుకోవాల్సిందే. అందుకే తక్కువ టైమ్ లో అయినా.. కోట్లు సంపాదించుకుంటున్నారు హీరోయిన్లు. బిజినెస్ లు చేస్తూ.. పెట్టుబడులు పెడుతూ.. దూసుకుపోతున్నారు. రిటైర్ అయ్యే టైమ్ కు గట్టిగా సంపాదించుకుంటున్నారు. 

జగన్ మాత్రమే కాదు.. స్టార్ హీరోలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అవమానించాడు.. సీనియర్ యాక్టర్ సంచలన వ్యాఖ్యలు.

ఈ లిస్ట్ లో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఉంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన తమన్నా..  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. ముంబైలో పుట్టి పెరిగిన తమన్నాకు మూవీ కెరీర్ ను ఇచ్చింది మాత్రం టాలీవుడ్ అనే చెప్పాలి.  ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నప్పటికీ.. అడపా దడపా.. తెలుగు, తమిళ సినిమాలు కూడా చేస్తోంది బ్యూటీ. 

మోక్షజ్ఞ కోసం కత్తిలాంటి హీరోయిన్, బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..?


తమన్నా జీరో సైజ్ గ్లామర్ తో కుర్ర కారును ఉర్రూతలూగించింది. అందానికి తగ్గట్టు నటనతో.. టాలెంట్ చూపిస్తూ.. దాదాపు  15 సంవత్సరాలకు  పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగు లేని ఇమేజ్ ను సాధించింది. సినిమాలు చేస్తూనే కొన్ని బిజినెస్ లలో కూడా ఆమె పెట్టుబడి పెట్టింది. చేతినిండా సంపాదించింది కూడా.  ఈమధ్య  తమన్నా బాలీవుడ్  నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతోంది. త్వరలో వీరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్టు సమాచారం. 

మెగాస్టార్ చిరంజీవి కి 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? వైరల్ అవుతున్న మెగాస్టార్ SSC మెమో..

హీరోయిన్ గా కోట్లు కూడబెట్టిన తమన్నా.. తాజాగా ముంబైలోని తన ప్లాట్ ను తాకట్టు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.  తమన్నా ముంబైలోని తన ఫ్లాట్‌ను ఇండియన్ బ్యాంక్‌లో  7 కోట్లకు తాకట్టు పెట్టిందన్న వార్త అందరిని షాక్ కు గురి చేసింది.  ఈ విషయం ఆమె చెప్పకపోయినా.. నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతోంది. 

రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..

Tamannaah

 తమన్నాకు ఇంత సడన్ గా ఆర్థిక కష్టాలు వచ్చిందనే విషయంపై అభిమనుల్లో చర్చ స్టార్ట్ అయ్యింది. అసలు తమన్నాకు ఏందుకు ఇలా ఇబ్బంది వచ్చింది. తాను సంపాదించిన కోట్లు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తున్నారు. తమన్నా ఈ ఏడాది కాని.. వచ్చే ఏడాది కాని.  విజయ్ వర్మను పెళ్ళాడే అవకాశం ఉంది. ఈక్రమంలో ఆమె ఆర్ధిక ఇబ్బందుల్లో పడటం ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి.

ముంబైలోని అంధేరి వెస్ట్ వీర దేశాయ్ రోడ్‌లోని తన సొంత ఫ్లాట్‌ను ఇండియన్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి.. 7.84 కోట్లు తీసుకుందట మిల్క్ బ్యూటీ

 తమన్నా నటిగా చాలా డబ్బు వెనకేసిందని సమాచారం. రెమ్యూనరేషన్ లో చాలా భాగం డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిందన్నమాట వినిపిస్తోంది.  ఇది కాకుండా, తమన్నాకు తన సొంతంగా జ్యూవ్వెల్లరీ బిజినెస్ కూడా ఉందట. అయితే వీటి వల్లే ఆమెకు ఆర్ధికంగా ఇబ్బందులు వచ్చాయా అని చర్చ జరుగుతోంది. 

Latest Videos

click me!