Bhola Shankar: ఒక్క క్షణమైనా చూపు తిప్పుకోగలమా..ఎల్లో శారీలో తమన్నా హొయలు

First Published | Nov 11, 2021, 5:25 PM IST

భోళా శంకర్ చిత్ర పూజా కార్యక్రమానికి తమన్నా అందంగా ముస్తాబై హాజరైంది. ఈ చిత్రంలో నటించనుడడంపై తమన్నా తన స్పందన తెలియజేసింది. 
 

సౌత్ లో తమన్నా స్టార్ హీరోయిన్. తక్కువ సమయంలోనే తమన్నా యువత హృదయాలు దోచేసుకుంది. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి టాలీవుడ్ లో గుర్తింపు లభించింది. ఆ చిత్రం యువతకు నచ్చడంతో తమన్నా పేరు మారుమోగింది. ఆమెకు యువతలో ఉన్న క్రేజ్ చూసి దర్శక నిర్మాతలు క్రమంగా అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. 

తన గ్లామర్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తూ Tamannaah స్టార్ గా ఎదిగింది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగ చైతన్య లాంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. ఇప్పటికి ఆమె తిరుగులేని ఆఫర్స్ తో దూసుకుపోతోంది. 


తాజాగా తమన్నా మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. మెగాస్టార్ Chiranjeevi సరసన Bhola Shankar చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. భోళా శంకర్ చిత్రం నేడు గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ కావడం విశేషం. ఈ కార్యక్రమానికి తమన్నా మతిపోగొట్టే గ్లామర్ లుక్ లో మెరిసింది. ఎల్లో శారీలో తమన్నా రెట్టింపు అందంతో మెరిసిపోతోంది. 

డిజైనర్ బ్లౌజ్, చీర కట్టులో తమన్నా అందానికే అందం అనిపిస్తోంది. కుర్రాళ్లు ఒక్క క్షణమైనా తమన్నాని చూడకుండా చూపు తిప్పుకోవడం కష్టం. తమన్నా చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్, మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్ర రావు, కొరటాల శివ, తమన్నా పాల్గొన్నారు. 

తమన్నా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు విడుదల కావడం, విజయాలు సాధిస్తుండడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది చాలా సినిమాలు చేశాను. కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. కానీ మెహర్ రమేష్ గారు, అనిల్ గారు అడగడంతో ఓకె చెప్పాను. కెరీర్ ఆరంభంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించాల్సింది. డేట్స్ లేకపోవడం వల్ల కుదర్లేదు అని తమన్నా తెలిపింది. 

ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమన్నా హీరోయిన్. నా శక్తంతా ఉపయోగించి ఈ చిత్రాన్ని ఎలాగైనా కమర్షియల్ గా సక్సెస్ చేస్తానని మెహర్ రమేష్ అన్నారు. రాఘవేంద్ర రావు చిరంజీవిపై క్లాప్ ఇవ్వడంతో ఈ చిత్రం ప్రారంభమైంది. 

తమన్నా గతంలో చిరంజీవి సైరా చిత్రంలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కి బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. Also Read: భోళా శంకర్... చెల్లి పాత్రకు అన్ని కోట్లా?... ఇదో సరికొత్త రికార్డు!

ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్,చిరంజీవితో పాటు మురళి శర్మ, రావు రమేష్, రఘుబాబు, వెన్నెల కిషోర్,  ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. Also Read: తన మూవీ నుంచి బ్రహ్మానందంని తొలగించిన నితిన్.. షాకింగ్ రీజన్, రూ.50 లక్షలు లాస్ ?

Latest Videos

click me!