అయితే క్రమేణా, అతడు కూడా ఆమెకు దగ్గరయ్యాడు. హౌస్ లో అందరిదీ ఒక ప్రపంచం, వాళ్ళిద్దరిది మరో ప్రపంచం. టాస్క్, ఈవెంట్స్, వంట వార్పు.. ఇంటి పనులు మినహాయిస్తే.. ప్రతి క్షణం ఇద్దరూ కలిసే ఉంటారు. అసలు పింకీ అనుక్షణం... మానస్ నామస్మరణలోనే బ్రతుకుతుంది. తన తిండి కూడా తెచ్చి మానస్ కి పెట్టాలని అనుకుంటుంది. అతడిని ఎవరైనా తప్పుకోగా మాట్లాడితే పింకీకి కోపం వస్తుంది.