తాజాగా విడుదలైన ప్రోమోలో హైపర్ ఆది, పొట్టి నరేష్ వైవిధ్యమైన స్కిట్ పెర్ఫామ్ చేశారు. వాళ్లిద్దరూ శ్రీదేవి పురం అనే గ్రామానికి వెళతారు. ఆ ఊరంతా వల్లకాడు అయిపోయి ఉంటుంది. దీనితో హైపర్ ఆది అక్కడున్న దెయ్యాలతోనే రొమాన్స్ మొదలు పెడతాడు. అక్కడ హైపర్ ఆది, నరేష్ మధ్య జరిగే సంభాషణ కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంది.