వందల ఎకరాలు పోగొట్టుకున్న రాజమౌళి ఫ్యామిలీ.. 12 మంది సింగిల్‌ బెడ్‌రూమ్‌లో.. కష్టాలు పంచుకున్న జక్కన్న

First Published Mar 31, 2024, 5:13 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ వందల ఎకరాలు పోగొట్టుకుందట. ఉమ్మడి ఫ్యామిలీ మొత్తం ఒకే బెడ్‌ రూమ్‌లో ఉండేవారట. ఆ స్ట్రగులింగ్‌ డేస్‌ విశేషాలను పంచుకున్నాడు జక్కన్న.   
 

దర్శకుడు రాజమౌళి.. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అపజయం ఎరుగని దర్శకుడు. సినిమాల్లో అద్భుతాలు సృష్టించి ఇప్పుడు మరిన్నిసంచలనాలకు సిద్ధమవుతున్నారు. చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌`తో అదరగొట్టిన ఆయన ఇప్పుడు మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నారు. 

రాజమౌళి ఫ్యామిలీ చాలా పెద్దది. రెండు కుటుంబాలు కలిసే ఉంటాయి. రాజమౌళి తండ్రి రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌, వాళ్ల అన్న శివ శక్తి దత్తా కలిసే ఉంటారు. రాజమౌళి చిన్నప్పుడు వారి ఫ్యామిలీ కర్నాటకలో ఉన్నారు. అలా రాజమౌళి రాయచూర్‌లో జన్మించారు. చిన్నప్పుడు వీరికి వందల ఎకరాలు ఉండేదట. అప్పట్లోనే 360 ఎకరాలు ఉండదని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు షాకింగ్‌ విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

తాను 10, 11ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన భూమి మొత్తం పోయిందట. 360 ఎకరాలు అమ్ముకున్నారట. అప్పట్లో శివశక్తి దత్త ఓ సినిమా చేశాడు. అది దారుణంగా పరాజయం చెందింది. దీనికితోడు రైల్వే ట్రాక్‌ కోసం కొంత భూమిని కోల్పోవల్సి వచ్చిందట. దీంతో ఫైనల్‌గా అన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత వీరి ఫ్యామిలీ మొత్తం చెన్నై షిఫ్ట్ అయ్యాయి. సినిమాలు పోవడంతో ఆఫర్లు లేవు, రోడ్డున పడేపరిస్థితి. అలాంటి టైమ్‌లో చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్‌లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌లో 12 మంది ఫ్యామిలీ ఉండేవారట. చాలా ఇరుకుగా, భరిస్తూ బతకాల్సి వచ్చిందన్నారు రాజమౌళి. 
 

ఆ సమయంలో రెంట్‌ కట్టడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందట. ఆ సమయంలో వాళ్ల పెద్ద ఒక్కడే ఫ్యామిలీ బాధ్యతని భుజాలపై వేసుకుని ఆయన కష్టపడి తమని పోషించినట్టు తెలిపారు రాజమౌళి. అనంతరం ఆయన పెళ్లిచేసుకున్నాడు. ఆమెని తాను అమ్మ అని పిలిచేవాడట రాజమౌళి. ఇక తన ఏజ్‌ 22 వచ్చింది. ఇంకా ఏం చేయట్లేదు, ఏం చేస్తావని నాన్న విజయేంద్రప్రసాద్‌ అడిగారు. ఆ సమయంలో ఒక ఆంటీ తనని తిట్టిందట. దీంతో తన వదిన చెప్పింది.. నా కొడుకు ఎప్పుడూ, ఎవరికి బ్యాడ్‌ నేమ్‌ తీసుకురాడు అని, దీంతో ఆ క్షణం నుంచి లైఫ్‌ని సీరియస్‌గా తీసుకున్నాడట రాజమౌళి. అప్పటినుంచి సీరియస్‌గా పనిచేయడం ప్రారంభించాడట రాజమౌళి. 

కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రాజమౌళి.. `స్టూడెంట్‌ నెం 1` చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్‌ హీరో. ఆ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. దీంతో రాజమౌళి అందరికి తెలిసిపోయారు. ఆ తర్వాత రెండో సినిమాగా `సింహాద్రి` చేశాడు టాలీవుడ్‌ రికార్డులు సృష్టించాడు. `సై`, `ఛత్రపతి`, `విక్రమార్కుడు`తో రికార్డులు తిరగరాశాడు. `మగధీర`తో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాడు. `ఈగ`, `మర్యాద రామన్న`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఇప్పుడు గ్లోబల్‌ మూవీపై కన్నేశాడు. 

Mahesh,rajamouli

ప్రస్తుతం రాజమౌళి మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఈ మూవీ కోసం మహేష్‌ వర్కౌట్స్ చేస్తున్నాడు. మరోవైపు రాజమౌళి స్క్రిఫ్ట్ ఫైనల్‌ చేయడంతోపాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని ప్రారంభించబోతున్నారు. ఆఫ్రికన్‌ అడవుల బ్యాక్‌ డ్రాప్‌లో ప్రపంచ సాహసికుడి జర్నీ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

click me!