ఇండస్ట్రీ గురించి పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల, చుట్టుపక్కల వాళ్లు చెప్పిందే కరెక్ట్ అని నమ్మేదాన్ని అని ఆమె చెప్పారు. "అందరూ ఇలాగే చేస్తారు" అని వాళ్లు అన్నప్పుడు, తాను వేరే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి బహుశా తనకే ఈ విషయాలు తెలియవేమో అని సరిపెట్టుకునేదాన్ని అని తాప్సీ అన్నారు. కానీ, కొన్ని విషయాలు సినిమాలో కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని ఆ తర్వాత తనకు అర్థమైందని చెప్పారు. గ్లామర్‌గా కనిపించడం, మితిమీరిన శృంగారం.. ఈ రెండూ ఒకటే కాదని తాప్సీ స్పష్టం చేశారు. సినిమాలో గ్లామరస్‌గా కనిపించినంత మాత్రాన, సీన్స్‌ను అనవసరంగా వల్గర్‌గా చూపించాల్సిన పనిలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక కెరీర్ విషయానికొస్తే, తాప్సీ పన్ను రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన 'గాంధారి' సినిమాలో కనిపించారు. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌కి దూరంగా ఉంటోంది.