ఈ సినిమా నుంచి ఇప్పటికే రణ్ బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. రక్తం మరకలతో బ్లూ కారులో ప్రయాణిస్తున్నట్టుగా స్టయిలీష్ లుక్‌లో రణ్ బీర్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ప్రేమ కోసం యుద్ధం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పుడు అలియాభట్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నారు.
తెలుగులోనూ లవ్ అండ్ వార్
మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను తెప్పిస్తున్నాయి. ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఆమె పాత్ర బలంగా ఉండబోతుందని, అదే సమయంలో గ్లామర్‌తో ట్రీట్ ఇవ్వబోతుందని తాజా లుక్ చూస్తుంటే అర్థమవుతుంది. దీంతో అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ దీన్ని విడుదల చేయబోతున్నారు.