Shruti Haasan: తల్లి కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.. షాకింగ్ కామెంట్స్

Published : Sep 25, 2026, 07:51 PM IST

పెళ్లి, మాతృత్వంపై హీరోయిన్ శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితానికి తోడు అవసరమే కానీ, పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పనిసరి కాదని ఆమె కుండబద్దలు కొట్టారు.

PREV
14
Shruti Haasan

హీరోయిన్ శ్రుతి హాసన్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఓపెన్ గానే మాట్లాడుతుంటారు. తాజాగా పెళ్లి, మాతృత్వం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ హోస్ట్ చేస్తున్న 'ఆల్ అబౌట్ హర్' పాడ్‌కాస్ట్‌లో శ్రుతి హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవడమే జీవితానికి ఏకైక లక్ష్యం కాదని స్పష్టం చేశారు.

జీవితంలో మనల్ని అర్థం చేసుకునే తోడు ఉండటం నిజమేనని, అంతమాత్రాన సమాజం సృష్టించిన పెళ్లి అనే చట్రంలో ఇరుక్కోవాల్సిన అవసరం లేదని శ్రుతి అన్నారు. గతంలో తాను కూడా పెళ్లి పీటల దాకా వెళ్లానని, కానీ చాలా ఆలోచించిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని ఆమె రివీల్ చేశారు.

24
అర్థం చేసుకుంటూ కలిసి ప్రయాణించడమే నిజమైన బంధం

పెళ్లి అంటే కేవలం చట్టబద్ధమైన పేపర్లపై సంతకాలు చేయడం లేదా గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకోవడం కాదని శ్రుతి అభిప్రాయపడ్డారు. ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం, ప్రేమ, రోజూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ప్రయాణించడమే నిజమైన బంధం అని ఆమె చెప్పారు.

34
పెళ్లి, పిల్లల గురించి ఓపెన్ అయిన శ్రుతి

సంప్రదాయాలను తాను గౌరవిస్తానని చెప్పిన శ్రుతి.. పెళ్లి పేరుతో ఆడంబరాలకు భారీగా డబ్బు ఖర్చు చేయడంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పెళ్లి కోసం వృధాగా ఖర్చు చేసే ఆ పెద్ద మొత్తాన్ని, కష్టాల్లో ఉన్నవారికో లేదా సమాజానికి ఉపయోగపడే మంచి పనులకో ఇస్తే దానికి ఒక అర్థం ఉంటుందని ఆమె అన్నారు.

ఇదే పాడ్‌కాస్ట్‌లో తన ఆరోగ్యం, మాతృత్వం గురించి కూడా శ్రుతి హాసన్ ఓపెన్ గా మాట్లాడారు. గతంలో తనకు పీసీఓఎస్ (PCOS) సమస్య ఉండేదని, భవిష్యత్తులో గర్భం దాల్చడం కష్టమవుతుందేమోనని భయపడేదాన్నని శ్రుతి చెప్పారు. పిల్లల గురించి ఆలోచించినప్పుడల్లా మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన ఉండేవన్నారు. కానీ, ఇటీవల తన గైనకాలజిస్ట్‌ను కలిసి మాట్లాడిన తర్వాత ఆ భయం పోయిందని శ్రుతి తెలిపారు. తల్లి కావాలనే సహజమైన కోరిక తనకు కూడా ఉందని ఆమె స్పష్టం చేశారు.

44
పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోవడం తప్పనిసరి కాదు

పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోవడం తప్పనిసరి కాదన్నది శ్రుతి హాసన్ అభిప్రాయం. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యే అవకాశం లేదా పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకునే అవకాశం.. ఇలా ఈ రోజుల్లో మాతృత్వాన్ని పొందేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని ఆమె అన్నారు. తన జీవితంలో కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఓపెన్ మైండ్ తో ఆలోచిస్తున్నానని శ్రుతి చెప్పారు.

పెళ్లి, మాతృత్వం గురించి శ్రుతి హాసన్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్సనల్ లైఫ్ గురించి ఆమె చెప్పిన విషయాలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories