Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా

Published : Sep 28, 2026, 09:18 PM IST

డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ మథియాస్ బోతో తనకున్న 13 ఏళ్ల రిలేషన్‌షిప్‌పై బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను తొలిసారిగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

PREV
16
అభిమానుల్లో ఎప్పుడూ క్యూరియాసిటీనే

సినిమా తారల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ కొందరు సెలబ్రిటీలు కెమెరా ముందు ఎంత యాక్టివ్‌గా ఉన్నా, తమ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను కూడా ఈ కోవకే చెందుతుంది.

26
పర్సనల్ విషయాలపై నోరువిప్పిన బ్యూటీ

తన సినిమాలు, కెరీర్ గురించి అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండే తాప్సీ, పర్సనల్ విషయాలకు వచ్చేసరికి పెద్దగా మాట్లాడదు. కానీ రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ, తన రిలేషన్‌షిప్, మ్యారేజ్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది.

36
13 ఏళ్ల ప్రేమ.. ఆ తర్వాతే పెళ్లి

డెన్మార్క్ మాజీ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, కోచ్ మథియాస్ బోతో తాప్సీ చాలా ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి బంధం ఏకంగా 13 ఏళ్ల పాటు కొనసాగింది. ఫైనల్‌గా 2024లో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లితో సహా తన పర్సనల్ విషయాలను తాప్సీ ఎప్పుడూ పబ్లిక్‌గా చెప్పలేదు. సోషల్ మీడియాలో కూడా చాలా లిమిటెడ్‌గా పోస్ట్‌లు పెడుతుంది.

46
'పరస్పర గౌరవమే మా బంధానికి బలం'

తన మ్యారేజ్ లైఫ్ గురించి తాప్సీ మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవమే తమ బంధానికి ప్రధాన కారణం అని చెప్పింది. తాను బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్‌లోనే మథియాస్‌తో రిలేషన్ మొదలైందని ఆమె తెలిపింది. ఇన్నేళ్లుగా కలిసి ప్రయాణించడం వల్ల తమ బంధంపై పూర్తి నమ్మకం ఏర్పడిందన్న తాప్సీ.. లైఫ్‌లో తాను తీసుకున్న నిర్ణయాల్లో మథియాస్‌ను భర్తగా ఎంచుకోవడం అత్యంత సంతృప్తినిచ్చిందని స్పష్టం చేసింది.

56
'నా లైఫ్ పార్ట్‌నర్‌ను నేనే సెలెక్ట్ చేసుకున్నా'

దేవుడిచ్చిన వరం తన కుటుంబం అని చెప్పిన తాప్సీ, తన కెరీర్ మాత్రం అనుకోకుండా వచ్చిన అవకాశం అని పేర్కొంది. కానీ తన లైఫ్ పార్ట్‌నర్‌ను మాత్రం తానే స్వయంగా ఎంచుకున్నానని, ఆ నిర్ణయం పట్ల తనకు చాలా గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇన్నేళ్లలో తమ మధ్య భద్రత, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరిగాయని, అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవమే తమ బంధాన్ని ఇంత స్ట్రాంగ్‌గా ఉంచిందని తాప్సీ వివరించింది.

66
ఈ రోజుల్లో రిలేషన్ మెయింటైన్ చేయడం కష్టమే!

సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న చాలామంది తమ జీవితంలో ప్రేమ కోసం వెతుకుతున్నారని తాప్సీ అభిప్రాయపడింది. అయితే ఈ రోజుల్లో రిలేషన్‌షిప్‌ను ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టంగా మారిందని ఆమె చెప్పింది. మనం టెంపరరీ హ్యాపీనెస్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అనే ప్రశ్నను కూడా ఆమె లేవనెత్తింది. కానీ తన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని, పరస్పర గౌరవం, నమ్మకం వల్లే తమ 13 ఏళ్ల బంధం నేటికీ బలంగా ఉందని తాప్సీ పన్ను స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories