తాప్సి నేడు ఆగష్టు 1న తన 39వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కెరీర్ గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. తాప్సీ పన్నూ ఇండియాలో అందరికీ కనెక్ట్ అయ్యే స్టార్గా ఎందుకు నిలిచిందో చెప్పే ఐదు కీలక విషయాలు ఇవే.
తాప్సి నేడు ఆగష్టు 1న తన 39వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కెరీర్ గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్ల కెరీర్లో తాప్సీ పన్నూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. దానికి ఒకే ఒక్క కారణం.. సహజత్వం. అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న సాధారణ మహిళ పాత్ర అయినా, శారీరకంగా శ్రమించాల్సిన యాక్షన్ రోల్స్ అయినా.. ఆమె ఎప్పుడూ నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంచుకుంది. లోపాలున్నా, ఎమోషనల్గా అయినా.. అవేవీ దాచుకోని పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇండియాలో అందరూ ఇష్టపడే స్టార్గా తాప్సీ ఎందుకు నిలిచిందో చెప్పే ఐదు విషయాలు ఇక్కడ చూద్దాం.
26
పవర్ ఫుల్ పాత్రలు ఎంచుకోవడమే ఆమె విజయం
‘పింక్’ నుంచి ‘థప్పడ్’ వరకు, తాప్సీ ఎందరో సాధారణ మహిళల పాత్రలకు ప్రాణం పోసింది. వాళ్లు సూపర్ హీరోలు కాదు, తమ కోసం తాము నిలబడే సామాన్యులు. చాలా మంది తమ జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులకు దగ్గరగా ఉండటంతో, ఈ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
36
సహజంగా నటించడమే తన బలం
‘హసీన్ దిల్రుబా’లోని రాణి పాత్ర అయినా, ‘నామ్ షబానా’లోని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినా.. తాప్సీ లోపాలు, బలహీనతలు, ఎమోషన్స్ ఉన్న పాత్రలను ఇష్టంగా చేసింది. పర్ఫెక్ట్గా కనిపించాలని కాకుండా, సహజంగా నటించడమే తన బలంగా మార్చుకుంది.
తాప్సీ ఎప్పుడూ కథకే పెద్దపీట వేసే స్క్రిప్ట్లను ఎంచుకుంది. గ్లామర్ లేదా ఫార్ములా పాత్రలపై ఆధారపడకుండా, కథకు అవసరమైన నటనతో కెరీర్ను నిర్మించుకుంది. అందుకే విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నమ్మకాన్ని కూడా గెలుచుకుంది.
56
వివిధ జోనర్ సినిమాలు
తాప్సీ తన నటనతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది. కోర్ట్రూమ్ డ్రామాలు, థ్రిల్లర్ల నుంచి రొమాంటిక్ మిస్టరీలు, యాక్షన్ ఎంటర్టైనర్ల వరకు.. ఒకే ఇమేజ్కు కట్టుబడి ఉండదు. ఆమె రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ కూడా ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ, మరో కొత్త అవతార్ను పరిచయం చేయనుంది.
66
నిజాయతీగా మాట్లాడే వ్యక్తిత్వం
తాప్సీ తన ముక్కుసూటి ఇంటర్వ్యూల నుంచి, సింపుల్గా ఉండే పబ్లిక్ పర్సనాలిటీ వరకు.. ఎప్పుడూ మనసులో ఉన్నది మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తుంది. ఆ నిజాయితే ఆమె నటనలోనూ ప్రతిఫలిస్తుంది. అందుకే నటిగానే కాకుండా, వ్యక్తిగానూ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.