సాయిధరమ్ తేజ్ నన్ను కలవలేదు, ఫోనూ చేయలేదు.. ఆ టార్చర్ తో జాబ్ కూడా మానేశా, అబ్దుల్ దయనీయ స్థితి

Published : Apr 26, 2023, 02:55 PM ISTUpdated : Apr 26, 2023, 03:11 PM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకుని పునర్జన్మ పొందాడనే చెప్పాలి. 2021లో తేజు బైక్ డ్రైవ్ చేస్తుండగా జారీ పడిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న తేజు ఎట్టకేలకు విరూపాక్ష చిత్రంతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు.

PREV
17
సాయిధరమ్ తేజ్ నన్ను కలవలేదు, ఫోనూ చేయలేదు.. ఆ టార్చర్ తో జాబ్ కూడా మానేశా, అబ్దుల్ దయనీయ స్థితి

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకుని పునర్జన్మ పొందాడనే చెప్పాలి. 2021లో తేజు బైక్ డ్రైవ్ చేస్తుండగా జారీ పడిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న తేజు ఎట్టకేలకు విరూపాక్ష చిత్రంతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చారు. విరూపాక్ష చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 

27

వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఈ మూవీ కట్టిపడేస్తుంది. ఇకపై సాయిధరమ్ తేజ్ గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో బిజీ కానున్నాడు. తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తేజు కాంబోలో సముద్రఖని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ కాంబోపై మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

37

ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం సాయిధరమ్ తేజ్ విరూపాక్ష ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బైక్ ప్రమాదానికి గురైనప్పుడు తాను సకాలంలో ఆసుపత్రికి చేరేలా సహాయం చేసిన సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ ని గుర్తు చేసుకున్నాడు. తాను చేసిన సహాయాన్ని డబ్బుతో వెలకట్టలేనని.. అందుకే అతడిని కలసి తన ఫోన్ నంబర్ ఇచ్చినట్లు తేజు తెలిపాడు. ఎలాంటి సహాయం అవసరం అయినా ఒక బ్రదర్ లాగా చేస్తానని అబ్దుల్  కి మాట ఇచ్చినట్లు తేజు తెలిపాడు. 

47

తాజాగా మీడియా అబ్దుల్ ని సంప్రదించగా అతడు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ ని కాపాడిన తర్వాత తనని ఎవరూ కలవలేదని అబ్దుల్ మీడియాకి వివరించాడు. సాయిధరమ్ తేజ్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఎవరూ నన్ను కలవలేదు. నన్ను కలసి ఫోన్ నంబర్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలు అన్నీ అబద్దాలే. కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు అని అబ్దుల్ వివరించాడు. 

57

పైగా ఫేక్ న్యూస్ వల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అబ్దుల్ తెలిపాడు. అంతకు ముందు సీఎంఆర్ లో వర్క్ చేస్తున్నాను. తేజు ప్రమాదం తర్వాత మెగా ఫ్యామిలీ తనని కలసి కొన్ని లక్షల డబ్బు ఇచ్చినట్లు ఫేక్ న్యూస్ వైరల్ అయింది. మా కొలీగ్స్ అందరూ బాగా డబ్బు ఇచ్చారంట కదా.. జాక్ పాట్ కొట్టావ్ అంటూ టార్చర్ పెట్టారు. అది భరించలేక అక్కడ ఉద్యోగం మానేశా. నాలుగు నెలలు ఖాళీగా ఉండి ఇబ్బందులు పడ్డా. 

67

మా బంధువులు కూడా ఫోన్ చేసి ఎన్ని లక్షలు ఇచ్చారు, ఇంకేం చేశారు అని పదే పదే ప్రశ్నిస్తున్నారు. అదంతా అబద్దం అని చెబుతుంటే వినడం లేదు అని అబ్దుల్ వాపోయాడు. సాయిధరమ్ తేజ్ నాకు ఎలాంటి ఫోన్ చేయలేదు. ఆయన నంబర్ కూడా నా దగ్గర లేదు. ఒక వేళ ఫోన్ చేస్తే వెళ్లి కలుస్తా అని అబ్దుల్ తెలిపారు. 

77

ఆరోజు నేను కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తుంటే నా కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది. వెంటనే స్పందించా. ఆ తర్వాత ఎంక్వైరీ కోసం మీడియా, పోలీసుల నుంచి చాలా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ వల్ల మా బంధువులు వరుసగా ఫోన్ చేస్తున్నారు. విరూపాక్ష చిత్రం చూశానని చాలా బావుందని అబ్దుల్ తెలిపాడు. 

click me!

Recommended Stories