బోయపాటి బర్త్ డే సెలబ్రేషన్స్ లో రామ్ పోతినేని, శ్రీలీలా సందడి.. వైరల్ గా మారిన ఫొటోలు

First Published | Apr 26, 2023, 1:58 PM IST

టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) పుట్టిన రోజు వేడుకులను గ్రాండ్ నిర్వహించారు. వేడుకల్లో రామ్ పోతినేని, హీరోయిన్ శ్రీలీలా సందడి చేయడం ఆకట్టుకుంది.
 

టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఒకరిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. 18 ఏండ్లకు పైగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 
 

అయితే, బోయపాటి శ్రీనివాస్ ఏప్రిల్ 25న గుంటూరు జిల్లా పెద్దకాకానిలో 1970లో ఆయన జన్మించారు. దీంతో నిన్న ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామ్ పోతినేని (Ram Pothineni) తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  దీంతో BoyapatiRapo టీమ్ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. 
 


బోయపాటి పుట్టిన రోజు వేడుకల్లో యంగ్ బ్యూటీ శ్రీలీలా  (Sreeleela), రామ్ పోతినేని సందడి చేశారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను బోయపాటితో కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. 

రామ్ పోతినేని స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. కుర్ర భామ శ్రీలీలా బ్లూ బాడీకాన్ డ్రెస్ లో మెరిసింది.  తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. బోయపాటి బర్త్ డే వేడుకల్లో వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్ లోనే జంటగా సందడి చేయడం ఆకట్టుకుంటోంది. ఇక వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ నెక్ట్స్ లెవల్ ఉండబోతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 
 

‘రెడ్’, ‘ది వారియర్’ చిత్రాలతో ఉస్తాద్ రామ్ పోతినేని ఫ్లాప్స్ అందుకున్న విషయం తెలిసిందే. మాస్ సినిమాల  వెనకాల పరిగెడుతున్న యంగ్ హీరో ‘అఖండ’తో భారీ సక్సెస్ ను అందించిన బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారిగా రాబోతున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 
 

BoyapatiRapo షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. రామ్ పోతినేని, శ్రీలీలా జంటగా నటిస్తున్నారు.  థమన్ సంగీతం అందిస్తున్నారు. 2023 అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. 
 

Latest Videos

click me!