ఇంతలో నాగార్జున నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేసే ప్రక్రియ మొదలు పెడతారు. నామినేషన్స్ లో ఉన్న రవి, విశ్వ, జెస్సి, శ్వేత, శ్రీరామ్, సిరి, సన్నీ, ప్రియాంక, షణ్ముఖ్ పైకి లేచి నిలబడతారు. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో బొమ్మ ఇస్తారు. ఆబొమ్మని ఓపెన్ చేయగా ప్రియాంక, షణ్ముఖ్ సేఫ్ అయినట్లు తేలుతుంది. మిగిలిన వాళ్ళు అలాగే నామినేషన్స్ లో ఉంటారు.