అలా అనకండి కడుపుతో ఉన్న పిల్లకి మీరే ఒడినింపండి అని చెప్పి ఒప్పిస్తారు చిట్టి దంపతులు. స్వప్నకి కనకం దంపతులు వొడి నింపుతారు. అందరూ ఆశీర్వచనం చేస్తారు. సీన్ కట్ చేస్తే ప్లాన్ ప్లాప్ అయినందుకు ఫ్రస్టేషన్ తో రగిలిపోతూ ఉంటారు రుద్రాణి, రాహుల్. కరెక్ట్ సమయానికి కనకం వచ్చి ప్లాన్ మొత్తం ప్లాప్ చేసింది తను రాకపోయి ఉంటే ఈపాటికి స్వప్నని బయటకు పంపించేసేవాళ్ళం అంటాడు రాహుల్. పోనీలే ఈ ఛాన్స్ కాకపోతే ఇంకొక ఛాన్స్ ఉంటుంది అంటుంది రుద్రాణి.