జీవితంలో సెకండ్ ఛాన్స్ ఉండదు.. గడచిన సమయం తిరిగి రాదు. కానీ ఆ కాలమే దిగివచ్చి చనిపోయిన వ్యక్తికి మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు పవన్, తేజు కలసి నటించడం తో బ్రో మూవీ పై అంచనాలు పెరిగాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.